
తెలంగాణను అట్రాసిటీ కేసులు లేని రాష్ట్రంగా నిలిపేందుకు అందరూ కృషి చేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం సంగారెడ్డి కలెక్టరేట్‌లో ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సీపీ, అదనపు ఎస్పీలు, జిల్లా రెవెన్యూ అధికారులతో పెండింగ్ కేసులపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీల భూ సమస్యలు, అట్రాసిటీ కేసులు, సర్వీస్ వ్యవహారాలు, సాధారణ కేసులకు సంబంధించి సిద్దిపేట జిల్లాలో 122 , మెదక్ జిల్లాలో 25, సంగారెడ్డిలో 27 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు ఆయనకు వివరించారు.