
వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట మండలం చిట్టంపల్లి గేటు వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. నలుగురు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మధ్యాహ్నం మర్పల్లి ప్రభుత్వ దవాఖానకు చేరుకొని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని, అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేలా చూస్తామన్నారు. ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన వారిలో ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆనంద్ తదితరులున్నారు.