Homeతెలంగాణ బ్రేకింగ్ న్యూస్హైదరాబాద్‌లో లారీ హల్‌చల్‌

హైదరాబాద్‌లో లారీ హల్‌చల్‌

హైదరాబాద్‌లోని ఉప్పల్లో ఓ లారీ హల్‌చల్‌ చేసింది. వేగంగా వచ్చి డీసీఎం వ్యాన్‌ను వెనుక నుండి ఢ కొట్టింది. దీంతో డీసీఎం వ్యాన్‌ అదుపుతప్పి ఓ ద్విచక్రవాహనాన్ని ఢ కొట్టింది. అంతటితో ఆగకుండా హనుమాన్‌ ఆలయం ప్రహరీగోడను ఢకొీట్టి అప్పుడు ఆగింది. ఇంతలో ఈ లారీని వెనుక నుండి మరో మినీ లారీ ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మినీ లారీలో ప్రయాణిస్తున్న నలుగురూ గాయపడ్డారు. ఈ ఘటనతో ఉప్పల్‌-సికింద్రాబాద్‌ ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌ భారీగా స్తంభించింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతుడు బంజారాహిల్స్‌కు చెందిన రాంచందర్‌(42)గా గుర్తించారు. లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular