
ల్యాండ్ సెటిల్‌మెంట్లలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొకొని జైలులో ఉన్న కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో చంచల్‌గూడలో ఉన్న నాగరాజ అక్కడే సూసైడ్ చేసుకున్నట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్‌లోని ఏఎస్‌రావునగర్‌లో రూ. 10 లక్షల లంచం తీసుకుంటూ ఆగస్టు నెలలో పట్టుబడ్డాడు. ఏఎస్‌రావునగర్‌లోని తన నివాసంలోనే ఆయన లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. కీసర ఎమ్మార్వో పరిధిలోని రాంపల్లిలో 28 ఎకరాల భూమికి సంబంధించిన వివాదంలో ఆయన లంచం తీసుకున్నాడు. ఆ సమయంలో ఆయన ఇంట్లో ఏసీబీ తనిఖీలు చేయగా రంపల్లిలో సత్య డెవలపర్స్ రియల్ ఎస్టేట్‌కు చెందిన వ్యక్తుల నుంచి లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.