
ముగ్గురు సోదరుల కిడ్నాప్ వ్యవహారంలో ఏ1 నిందితుడు ఏవీ సుబ్బారెడ్డిని హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఏ2 నిందితురాలిగా ఉన్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియను అరెస్ట్ చేసి వైద్యపరీక్షలకు తరలించగా.. తాజాగా ఏవీ సుబ్బారెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఈటీవీతో ఆయన మాట్లాడారు. కిడ్నాప్ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. తాను ఏ-1 నిందితుడిని కాదన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో ఉన్న పేర్లనే పోలీసులు పేర్కొన్నారని చెప్పారు. విచారణలో వాస్తవాలు బయటకు వస్తాయన్నారు.