Homeతెలంగాణ బ్రేకింగ్ న్యూస్తెలంగాణ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ఆపెయ్యండి : హై కోర్ట్ ఆదేశాలు

తెలంగాణ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ఆపెయ్యండి : హై కోర్ట్ ఆదేశాలు

తెలంగాణలో ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ఆపేయ్యాలని హైకోర్టు కీలక ఆదేశాలు చేసింది. కరోనా కారణంగా ఇంటర్‌ పరీక్షల ఫీజు చెల్లించి పరీక్షలు రాయలేకపోయిన, పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థులకు ఇంటర్‌ బోర్డు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించలేదు. దీంతో ఆ విద్యార్థులు 35 మార్కులు వచ్చినట్లుగా పరిగణించి పాస్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. కానీ ఎంసెట్‌ కౌన్సిలింగ్‌కు 45 శాతం మార్కులు ఉండాలి. దీంతో వీరంతా కౌన్సిలింగ్‌ అవకాశాన్ని కోల్పోయారు. ఈ నేపథ్యంలో వారంతా హైకోర్టును ఆశ్రయించడంతో విచారణ జరిపి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభుత్వం జీవో జారీచేసే వరకు కౌన్సెలింగ్‌ వాయిదా వేయాలని ఆదేశించింది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular