
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురుతుందని, కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. అదిలాబాద్ లో మంగళవారం రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీజేపీ తరుపున సీఎం అభ్యర్థి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఆదివీసీలను ప్రభుత్వం అణిచివేస్తోందని మండిపడ్డారు. పోడు భూములపై ఆంక్షలు కొనసాగుతున్నాయన్నారు. ఆదివాసీలను పులి భయం చూపెట్టి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.