https://oktelugu.com/

త్వరలో గాంధీ ఆసుపత్రిలో సాధారణ వైద్య సేవలు: మంత్రి ఈటల

హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో త్వరలో సాధారణ వైద్య సేవలు ప్రారంభమవుతాయని తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. కరోనా వైరస్‌ రాష్ట్రంలో ప్రారంభమైనప్పటి నుంచి గాంధీ ఆసుపత్రిలో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు ఆరు నెలలుగా ఇందులో సాధారణ వైద్య సేవలను నిలిపివేశారు. కరోనా కేసులు విస్తరిస్తున్నా ప్రాణాంతకం కాదని, అయితే అజాగ్రత్తగా వ్యవహరించద్దని మంత్రి తెలిపారు. అందువల్ల త్వరలో గాంధీలో వైద్య సేవలు ప్రారంభిస్తున్నామన్నారు. కరోనా పేరుతో ప్రైవేట్‌ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 2, 2020 3:10 pm
    Follow us on

    హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో త్వరలో సాధారణ వైద్య సేవలు ప్రారంభమవుతాయని తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. కరోనా వైరస్‌ రాష్ట్రంలో ప్రారంభమైనప్పటి నుంచి గాంధీ ఆసుపత్రిలో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు ఆరు నెలలుగా ఇందులో సాధారణ వైద్య సేవలను నిలిపివేశారు. కరోనా కేసులు విస్తరిస్తున్నా ప్రాణాంతకం కాదని, అయితే అజాగ్రత్తగా వ్యవహరించద్దని మంత్రి తెలిపారు. అందువల్ల త్వరలో గాంధీలో వైద్య సేవలు ప్రారంభిస్తున్నామన్నారు. కరోనా పేరుతో ప్రైవేట్‌ ఆసుపత్రులో దోచుకుంటున్నాయని.. అందువల్ల ప్రభుత్వ ఆసుపత్రులకే వెళ్లాని సూచించారు.