
ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణం, ప్రకృతి రక్షణ పట్ల సృహ ఇప్పుడు వస్తోందని, తెలంగాణ రాష్ట్రం ఆ విషయంలో ముందే మేల్కొందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రం సిద్దించిన తొలినాళ్లలోనే ముందు చూపుతో ఫారెస్ట్ కాలేజీకి బీజం వేశారని, అంతర్జాతీయ ప్రమాణాలతో ఫారెస్ట్ కాలేజీ ఇప్పుడు మన ముందు ఉందని మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. ఫారెస్ట్ కాలేజీ, రీసెర్ట్ ఇనిస్టిట్యూట్ లో మొదటి బ్యాచ్ పూర్తి చేసిన బీఎస్సీ ఫారెస్ట్రీ విద్యార్థుల స్నాతకోత్సవంలో ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావుతో కలిసి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు.