
సన్నరకాల వరికి రూ.2500 మద్దతు ధర ప్రకటించాలని గురువారం రైతు ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రగతిముట్టడికి విఫలయత్నం చేశారు. కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల నుంచి వచ్చిన రైతులు ప్రగతిభవన్ ను ముట్టడించేందుకు యత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకొని గోషామహల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. సీఎం కేసీఆర్ చెబితేనే తాము సన్నరకం వరిని వేశామని, పంట చేతికొచ్చే సమయంలో భారీ వర్షాలకు ధాన్యం రంగు మారిందన్నారు. దీంతో ప్రభుత్వం తక్షణమే సన్న రకాలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. క్షేత్రస్థాయిలో ధాన్యం, పత్తి, మొక్కజొన్న ఇతర పంటలు కొనుగోలు చేయడం లేదని వారు తెలిపారు.