
సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో జరగుతున్న పోలింగ్ కేంద్రాల వద్ల ఓటర్లు బారులు తీరారు. మొత్తం 315 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కోవిడ్ నిబంధనల్లో భాగంగా భౌతిక దూరం పాటిస్తూ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కాగా ఉదయం 11 గంటల వరకు 34. 33 శాతం పోలింగ్ నమోదైంది. సాధారణ ఓటర్లకు సాయంత్రం 5 గంటల వరకు కోవిడ్ బాధితులకు 6 గంటల వరకు ఓటు వేసే హక్కును కల్పించారు. ఇక 85 సమస్యాత్మక కేంద్రాల వద్ద పోలీసులు భారీగ మోహరించారు. &టికప్పడు అప్రమత్తంగా ఉంటూ పర్యవేక్షిస్తున్నారు.