
ప్రజలపై టీఆర్ఎస్ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయవద్దని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. ఆదివారం గ్రేటర్ ఎన్నికల్లో గెలుపొందిన కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతీ కార్పొరేటర్ ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించాలన్నారు. మేయర్ ఎంపికపై అవలంభించాల్సిన విషయాలపై దిశా నిర్దేశం చేశారు. అంతకుముందు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రంపటం వద్ద నివాళులర్పించారు. ప్రజలు టీఆర్ఎస్ ను ఆదరిస్తున్నారని వారికి అవసరమైన సంక్షేమ పథకాలను తీసుకెళ్లాలన్నారు.