ఆర్జీవీ కార్యాలయం ఎదుట ‘దిశ’ కుటుంబ సభ్యుల ఆందోళన..
షాద్‌నగర్‌లో జరిగిన దిశ హత్యాచారం సంఘటనపై ప్రముఖ్ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ‘దిశ ఎన్‌కౌంటర్’ పేరుతో సినిమాను నిర్మించిన విషయం తెలిసింది. ఈ సినిమాను నిలిపివేయాలని బాధితురాలి తండ్రి శ్రీధర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై కోర్టు స్పందిస్తూ అభ్యంతరాలను సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. తాజాగా ఆదివారం దిశ కుటుంబ సభ్యు హైదరాబాద్‌లోని రాంగోపాల్‌వర్మ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. వివాదాస్పద సినిమాలు తీస్తున్న రాంగోపాల్ వర్మను ఆడపిల్ల ఉన్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు […]
Written By:
, Updated On : October 11, 2020 / 03:54 PM IST

షాద్‌నగర్‌లో జరిగిన దిశ హత్యాచారం సంఘటనపై ప్రముఖ్ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ‘దిశ ఎన్‌కౌంటర్’ పేరుతో సినిమాను నిర్మించిన విషయం తెలిసింది. ఈ సినిమాను నిలిపివేయాలని బాధితురాలి తండ్రి శ్రీధర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై కోర్టు స్పందిస్తూ అభ్యంతరాలను సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. తాజాగా ఆదివారం దిశ కుటుంబ సభ్యు హైదరాబాద్‌లోని రాంగోపాల్‌వర్మ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. వివాదాస్పద సినిమాలు తీస్తున్న రాంగోపాల్ వర్మను ఆడపిల్ల ఉన్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు నిలదీయాలని కోరారు. ఇప్పటికే ఎన్నో బాధలు అనుభవిస్తున్న తమకు ఈ సినిమాతో మరింత కుంగిపోవాల్సి వస్తుందని అన్నారు.