
ధరణి వెబ్‌పోర్టల్ సేవలు, భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లపై తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తోపాటు పలువురు మంత్రులు, కరీంనగర్, నల్గొండ, నిజామాబాద్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు సమీక్షలో పాల్గొన్నారు. ధరణి, రిజిస్ట్రేషన్లపై క్షేత్రస్థాయి పరిస్థితిని సీఎం తెలుసుకుంటున్నారు. సమస్యల పరిష్కారానికి తగు నిర్ణయాలు తీసుకోనున్నారు.