
వరంగల్ జిల్లాలోని ఎస్సారెస్పీ కాలువకు గండి పడింది. దీంతో సమీపంలోని గ్రామాల్లోకి భారీగా నీరు చేరడంతో నివాస గ్రుహాలు నీటి మునిగాయి. వరంగల్ అర్బన్ జిల్లాలోని గుండ్ల సింగారం వద్ద కాలువకు గండి పడడంతో ఆ గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలోని ఇళ్లన్నీ నీట మునిగాయి. గండి పూడ్చేందుకు అధికారులు సిద్ధం కావాలని మంత్రి సత్యవతిరాథోడ్ ఆదేశించారు. గండి పడేందుకు కారణాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని కోరారు. గతంలో కరీంనగర్ జిల్లాలో చొప్పదండి ప్రాంతంలో ఎస్సారెస్పీ కాలువకు భారీగా గండి పడింది. ఆ సమయంలో ఆ సమయంలో పంట నష్టంతో పాటు పలు ఇళ్లు నీట మునిగాయి.