
ఇరిగేషన్, వ్యవసాయశాఖ అధికారులు సమన్వయంతో సాగునీటి సమస్యలు లేకుండా ఉన్న నీటిని సద్వినియోగం చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన సాగునీటి సలహా బోర్డ్ సమావేశం మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రం సమీపంలోని నాగవరంలో జరిగింది. సమావేశంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రతి రిజర్వాయర్ కింద ఎంత నీరు అందుబాటులో ఉంది? ఎన్ని రోజులు నీరు వదలాలనే విషయమై అధికారులు ప్రణాళిక రూపొందించాలన్నారు. నీరు ఎక్కువగా వినియోగించడం వల్ల పంట తక్కువ వస్తుంది అనే విషయాన్ని రైతులకు అవగాహన కల్పించాలన్నారు.