https://oktelugu.com/

లంచం కేసులో సీఐ అరెస్టు

లంచం తీసుకున్నాడన్న ఆరోపణలపై విచారణ చేసిన ఏసీబీ అధికారులు ఓ సీఐ ఇంట్లో సోదాలు నిర్వహించారు. పలు డాక్యెమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణలు భాగంగా కీలక సమాచారం దొరకడంతో సీఐని అరెస్టు చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన బత్తుల సుధాకర్ క్రికెట్ బెట్టింగ్ విషయంలో పోలీసులకు చిక్కాడు. దీంతో కామారెడ్డి టౌన్ సీఐ జగదీశ్, సుధాకర్ ను విడుదల చేయడానికి రూ.5 లక్షలు డిమాండ్ చేశాడు. మొదటి విడుదల రూ.39 వేలు ముట్టజెప్పాడు. దీంతో సుధాకర్ […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : November 21, 2020 11:04 am
    Follow us on

    లంచం తీసుకున్నాడన్న ఆరోపణలపై విచారణ చేసిన ఏసీబీ అధికారులు ఓ సీఐ ఇంట్లో సోదాలు నిర్వహించారు. పలు డాక్యెమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణలు భాగంగా కీలక సమాచారం దొరకడంతో సీఐని అరెస్టు చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన బత్తుల సుధాకర్ క్రికెట్ బెట్టింగ్ విషయంలో పోలీసులకు చిక్కాడు. దీంతో కామారెడ్డి టౌన్ సీఐ జగదీశ్, సుధాకర్ ను విడుదల చేయడానికి రూ.5 లక్షలు డిమాండ్ చేశాడు. మొదటి విడుదల రూ.39 వేలు ముట్టజెప్పాడు. దీంతో సుధాకర్ ను బెయిల్ పై విడిచిపెట్టాడు. మిగతా డబ్బుల కోసం డిమాండ్ చేయగా సుధాకర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో నల్గొండ రేంజ్ ఏసీబీ అధికారి ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో సీఐ జగదీశ్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. పక్కా ఆధారాలు సేకరించిన ఏసీబీ అధికారులు ఆయనను అరెస్టు చేశారు.