హైదరాబద్ లో మీసేవ ద్వారా పంపిణీ చేస్తున్న వరద సాయాన్ని ఆపేయాలని తెలంగాణ ఎలక్షన్ కమిషనర్ పార్థసారధి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ లో గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నందున కోడ్ అమలులో ఉంటుందని, అందువల్ల వరద సాయాన్ని వెంటనే ఆపేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల తరువాత యథావిధిగా వరదసాయాన్ని కొనసాగించవచ్చని పేర్కొన్నారు. హైదరాబద్ లో కురిసిన వర్షాలతో నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రతి ఇంటికి రూ.10 వేలు ఇస్తామని ప్రకటించింది. అయితే ఈ సాయానికి అడుగడుగునా అడ్డంకులు ఏర్పడుతున్నాయి. అంతకుముందు సాయం పంపిణీలో అవకతవకలు ఏర్పడ్డాయని పంపిణీని నిలిపివేశారు. తాజాగా ఎన్నికల నేపథ్యంలో వరదసాయాన్ని ఆపేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయడంతో టీఆర్ఎస్ ప్రభుత్వం షాక్ కు గురైంది.