
నగరంలోని నేరేడ్‌మెట్ డివిజన్‌లో ఎన్నికల ఫలితాల వెల్లడికి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచింది. దీంతో ఈ రోజు సైనిక్‌పురిలోని భవన్స్ వివేకానంద కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. నేరేడ్‌మెట్ డివిజన్ మొత్తంలో 25,176 ఓట్లు పోల్ కాగా ఇందులో 24,632 ఓట్లు లెక్కించారు. లెక్కించకుండా పక్కనబెట్టిన 50వ పోలింగ్ కేంద్రానికి చెందిన 544 ఓట్లను మాత్రమే ఇవాళ లెక్కించి, ఫలితాన్ని వెల్లడిస్తారు. అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటి వరకు లెక్కించిన ఓట్లలో బీజేపీ అభ్యర్థిపై టీఆర్ఎస్ అభ్యర్థి 504 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 200మంది సిబ్బందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.