
రైతుల నిరసనతో మమేకమయ్యేందుకు ప్రతిపక్షాల్లో ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్, సిపిఎం నేత సీతారాం ఏచూరి చర్చలు జరిపారు. బుధవారం సాయంత్రం 5 గంటలకు అయిదుగురు సభ్యుల ప్రతినిధి వర్గం రాష్ట్రపతి కోవింద్‌ను కలుసుకోనుంది. రాహుల్, పవార్, ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, డిఎంకె నేత టిఆర్ బాలు ఈ ప్రతినిధి వర్గంలో ఉన్నారు. రైతాంగ సంక్షోభాన్ని సృష్టిస్తున్న సాగు చట్టాలను రద్దు చేసేలా రాష్ట్రపతి జోక్యం కోరనున్నట్లు ఏచూరి వెల్లడించారు.