హైదరాబాద్‌లోని జగద్గిరి గుట్టలో ఆటోలో పేలుడు సంభవించింది. అస్బెస్టాన్ కాలనీ వద్ద శనివారం ఆగి ఉన్న ఆటోలో పేలుడు జరగడంతో పక్కనే ఉన్న డ్రైవర్ యూసఫ్‌కు తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. వెంటనే వారు అతడిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి పేలుడుకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. ఈ పేలడుతో స్థానికులు ఒక్కసారిగా పరుగులు తీశారు.