
హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. జహీరాబాద్‌కు చెందిన శ్రీనివాస్, శ్వేతా అనే విద్యార్థులు డైట్‌సెట్ పరీక్ష రాసేందుకు ద్విచక్రవాహనంపై ఆదివారం ఉదయం పరీక్ష కేంద్రానికి బయలుదేరారు. మదీనాగూడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ వారు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీనివాస్, శ్వేత అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదస్థలానికి చేరుకు పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.