Whatsapp New Feature: స్మార్ట్ మొబైల్ లో అత్యంత ఎక్కువగా వాడే యాప్ Whatsapp మాత్రమే. ఈ యాప్ ను ఒక్కసారి కూడా ఓపెన్ చేయకుడా దిన చర్య గడవని వారు చాలా మంది ఉన్నారు. స్కూల్ కెళ్లే విద్యార్థుల నుంచి బడా వ్యాపారుల వరకు వాట్సాప్ ను తప్పనిసరిగా ఉపయోగిస్తున్నారు. అయితే ఈ యాప్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వినియోగదారులకు అనుగుణంగా మారుతుంది. వారి అవసరాలను బేస్ చేసుకొని కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. తాజాగా వాట్సాప్ కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. ఆ ఫీచర్ వివరాల్లోకి వెళితే..
వాట్సాప్ ద్వారా ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తితో అయినా కాంటాక్ట్ కావొచ్చు. ఈ తరుణంలో కొన్ని సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ముఖ్యంగా మొబైల్ హ్యాక్ కు గురైతే వాట్పాప్ లోని ఇన్ఫర్మేషన్ అంతా బయటి వారికి తెలియవచ్చు. అందువల్ల ఇప్పటికే వాట్సాప్ పలు రకాల Privacy ఫీచర్లను తీసుకొచ్చింది. ఖాతాదారుడికి సంబంధించిన ఫొటోలు, ఇతర సమాచారం ఇతరులు తస్కరించకుండా సెక్యూరిటీ ఆప్షన్లను ఇచ్చింది. తాజాగా ప్రైవసీకి సంబంధించిన మరో ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
వాట్పాప్ లో ఫొటో ఆధారంగా ‘అవతార్’ ను తయారు చేసుకోవచ్చు. దీనిని డీప్ లో పెట్టుకోవడం ద్వారా ఆ వ్యక్తి ఎవరో గుర్తుపట్టోచ్చు. ఇలా చేయడం వల్ల ఒరిజినల్ ఫొటో లేకున్నా కాంటాక్ట్ ఉండే వ్యక్తి ఎవరో తెలిసిపోతుంది. కొన్ని కారణాల వల్ల తమ ఒరిజినల్ ఫొటో పెట్టకుండా ఇలాంటి అవతార్ ను తయారు చేసిన డీప్ లో సెట్ చేసుకుంటున్నారు. అయితే కొంత మంది వీటిని కూడా కాపీ చేసుకొని ఇతరులు వాడుతూ సమస్యలు తెస్తున్నారు. ఇలాంటి సమయంలో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది వాట్సాప్.
కొత్త ఫీచర్ ప్రకారం.. వాట్పాప్ లోని ఖాతాదారుడి అవతార్ ను ఇతరులు స్టిక్కర్లో వాడుకోకుండా చేయొచ్చు. ఇందు కోసం ముందుగా My Contacts లోకి వెళ్లాలి. ఆ తరువాత Nobody అనే ఆప్సన్ ను ఎంచుకోవాలి. దీనిని సెట్ చేసుకోవడం వల్ల వ్యక్తిగత అవతార్ ను ఇతరులను వాడడానికి అవకాశం ఉండదు. అయితే కొందరికి అవకాశం ఇవ్వడానికి సెలెక్టెడ్ కాంటాక్ట్స్, మై కాంటాక్ట్స్ అనే ఆప్షన్లు కూడా ఉంటాయి. వీటి ద్వారా ఎలా వీలైతే అలా సెట్ చేసుకోవచ్చు.