Site icon OkTelugu

WhatsApp: WhatsApp నుంచి కొత్త ఫీచర్.. ఇక వాటి గురించి తెలుసుకోవచ్చు..

WhatsApp Noise Cancellation Feature Update

WhatsApp Noise Cancellation Feature Update

WhatsApp: క్షణాల్లో మెసేజ్ పంపేందుకు అందుబాటులో ఉన్న WhatsApp వాడని మొబైల్ వినియోగదారులు లేరు అని చెప్పవచ్చు. అన్ని రకాలుగా ఉపయోగపడే ఈ యాప్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వస్తోంది. ఇందులో వ్యక్తిగతంగా, గ్రూపుల నుంచి మెసేజ్లు పంపుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇటీవల వాట్సాప్ మాతృ సంస్థ అయినా Meta కొత్త ఫీచర్ ను అప్డేట్ చేసింది. ఈ ఫీచర్ ద్వారా గ్రూపులో పాత మెసేజ్లను చూసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పటివరకు ఎలాంటి సంభాషణలు జరిగాయి అనే హిస్టరీని కూడా తెలుసుకునే ఛాన్స్ ఉంది. మరి అలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే?

వాట్సాప్ లో సాధారణంగా గ్రూపులో యాడ్ అయినప్పుడు పాత విషయాలు ఈ సభ్యుడికి తెలియవు. అప్పటికే ఏదైనా విషయంపై చర్చ సాగుతూ ఉంటే అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. దాని గురించి పూర్తిగా తెలియాలంటే అంతకుముందు ఎలాంటి చాటింగ్ జరిగిందో తెలుసుకోవాలి. ఈ విషయాన్ని ఇప్పటినుంచి వాట్సాప్ అందిస్తుంది. అంటే ఒక వ్యక్తి గ్రూపులో యాడ్ అయినప్పుడు అంతకుముందు ఎలాంటి చాటింగ్ జరిగిందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కొన్ని మెసేజ్లు ఇప్పటివరకు ఏవి ఉండేవి? అనే విషయాలను కూడా తెలుసుకొని ఆ గ్రూపులో కొనసాగాలా? వద్దా..? అనేది కూడా నిర్ణయించుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది.

అయితే ఈ ఫీచర్ సదుపాయాలు పొందాలంటే ముందుగా గ్రూపులో ఉన్న అడ్మిన్ పర్మిషన్ పొందాల్సి ఉంటుంది. ఒక గ్రూపులో కొత్త సభ్యుడు చేరినప్పుడు అడ్మిన్ అతనికి పాత విషయాలను తెలిసే విధంగా అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇచ్చినప్పుడు మాత్రమే అతడు పూర్వపు విషయాలను తెలుసుకోగలుగుతాడు. ఇలా తెలుసుకునేందుకు ఆ సభ్యుడు Group Message History అనే ఆప్షన్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ హిస్టరీలో భాగంగా 25 మెసేజ్ లను మాత్రమే చూసేందుకు అవకాశం ఉంటుంది. ఈ సదుపాయం ఉద్యోగులు లేదా కంపెనీలో ఉండే వ్యక్తులకు చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా కమ్యూనిటీ చాటింగ్, కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విషయాలు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.

Group Message History అనే ఆప్షన్ End To End Enscription పరిధిలోనే పనిచేస్తుంది. అంతేకాకుండా షేర్ చేసిన మెసేజ్లు ఆ గ్రూప్ సభ్యులు మాత్రమే చూడగలుగుతారు. కొత్త సభ్యుడికి మెసేజ్ హిస్టరీ షేర్ చేసినప్పుడు టైం స్టాంపులు, వ్యక్తిగత వివరాలతో ప్రతి గ్రూపు సభ్యుడు కి మెసేజ్ వస్తుంది. ఇది సాధారణ హిస్టరీతో పోలిస్తే కాస్త భిన్నంగా కనిపిస్తుంది. ఈ ఫీచర్ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. త్వరలోనే ఆండ్రాయిడ్ తో పాటు యాపిల్ ఫోన్లలో అందుబాటులోకి రానుంది.

Exit mobile version