Site icon OkTelugu

Whatsapp new feature update 2026: WhatsApp లో కొత్త ఫీచర్.. ఇక అవి సులభంగా చూడొచ్చు..

WhatsApp New Privacy Feature

WhatsApp New Privacy Feature

Whatsapp new feature update 2026: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగిస్తున్న మెసేజింగ్ యాప్ WhatsApp. విద్యార్థుల నుంచి ఉద్యోగులు, వ్యాపారులు తమ అవసరాల కోసం ఈ యాప్ ను నిరంతరం యూజ్ చేస్తూ ఉంటారు. అయితే వీరి అవసరాలను దృష్టిలో ఉంచుకొని వాట్సాప్ మాతృ సంస్థ అయిన మెటా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటివరకు వాట్స్అప్ లోని ఇంటర్‌ఫేస్‌లో మరో కీలక మార్పుకు సిద్ధమవుతోంది. యూజర్లకు మరింత సౌలభ్యం కల్పించాలనే లక్ష్యంతో చాట్ అనుభవాన్ని సింపుల్‌గా, వేగవంతంగా మార్చే దిశగా ఈ కొత్త ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇంతకీ ఈ ఫీచర్ విశేషాలు ఏంటంటే?

వాట్సాప్ లో మెసేజ్ బాక్స్ తో పాటు చానల్స్ కూడా ఉంటాయని ఇప్పటికే చాలామందికి తెలుసు. అయితే ప్రస్తుతం ఛానల్స్‌ను చూడాలంటే యూజర్లు ‘UPDATES’ ట్యాబ్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడే స్టేటస్‌లు, ఛానల్స్ రెండూ కలిసి కనిపిస్తాయి. అయితే చాలా మంది యూజర్లు ఛానల్స్‌ను తరచుగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో, వాటిని సులభంగా యాక్సెస్ చేయాలనే ఉద్దేశంతో వాట్సాప్ కొత్త మార్పులను తీసుకురాబోతోంది.

ఈ కొత్త అప్‌డేట్ ప్రకారం.. ఛానల్స్‌ను నేరుగా ‘Chats’ ట్యాబ్‌లోకి తీసుకురానున్నారు. అంటే ఇకపై వ్యక్తిగత చాట్స్, గ్రూప్ చాట్స్‌తో పాటు ఛానల్స్ కూడా అదే సెక్షన్‌లో కనిపించనున్నాయి. దీనివల్ల యూజర్లు ఒక్కటే ట్యాబ్‌లో అన్ని కమ్యూనికేషన్ ఆప్షన్లను సులభంగా నిర్వహించగలుగుతారు.ఈ ఫీచర్‌లో భాగంగా ప్రత్యేక ఫిల్టర్ ఆప్షన్‌ను కూడా ప్రవేశపెట్టనున్నారు. యూజర్లు ‘Chats’ ట్యాబ్‌లోకి వెళ్లిన తర్వాత, తమకు కావాల్సినవి మాత్రమే చూసేందుకు ఫిల్టర్‌ను ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు, కేవలం ఛానల్స్ మాత్రమే చూడాలనుకుంటే, ఆ ఫిల్టర్‌ను సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. దీని వల్ల యాప్ వినియోగం మరింత సౌకర్యవంతంగా మారుతుంది.

ఈ మార్పులతో ‘UPDATES’ ట్యాబ్‌లో కూడా పెద్ద మార్పు రానుంది. ఛానల్స్‌ను అక్కడి నుంచి పూర్తిగా తొలగించి, కేవలం స్టేటస్‌లను మాత్రమే చూపించేలా డిజైన్ చేయనున్నారు. దీంతో స్టేటస్ మరియు ఛానల్స్ మధ్య ఉన్న గందరగోళం తగ్గి, యూజర్ అనుభవం క్లియర్‌గా మారుతుంది.

ప్రస్తుతం ఈ ఫీచర్ డెవలప్మెంట్ దశలో ఉంది. త్వరలో బీటా వెర్షన్‌లో అందుబాటులోకి వచ్చి, ఆ తర్వాత అన్ని యూజర్లకు విడుదలయ్యే అవకాశముంది. ఈ మార్పులతో Meta యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version