ఆధార్‌లో వివరాలు తప్పుగా ఉన్నాయా.. ఇంటినుంచే మార్చుకునే ఛాన్స్?

మన దేశంలో నివశించే ప్రజలకు కీలకమైన డాక్యుమెంట్లలో ఆధార్ కార్డ్ ఒకటనే సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆధార్ కార్డ్ ద్వారానే ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి. బ్యాంక్ ఖాతా తెరవాలన్నా, ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయాలన్నా ఆధార్ కార్డును ఖచ్చితంగా కలిగి ఉండాలనే సంగతి తెలిసిందే. ఆధార్ కార్డ్ లో వివరాలు కరెక్ట్ గా ఉన్నాయో తప్పుగా ఉన్నాయో కచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఆధార్ కార్డులో పేరు, పుట్టిన తేదీ, అడ్రస్ […]

Written By: Navya, Updated On : June 22, 2021 7:30 pm
Follow us on

మన దేశంలో నివశించే ప్రజలకు కీలకమైన డాక్యుమెంట్లలో ఆధార్ కార్డ్ ఒకటనే సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆధార్ కార్డ్ ద్వారానే ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి. బ్యాంక్ ఖాతా తెరవాలన్నా, ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయాలన్నా ఆధార్ కార్డును ఖచ్చితంగా కలిగి ఉండాలనే సంగతి తెలిసిందే. ఆధార్ కార్డ్ లో వివరాలు కరెక్ట్ గా ఉన్నాయో తప్పుగా ఉన్నాయో కచ్చితంగా చెక్ చేసుకోవాలి.

ఆధార్ కార్డులో పేరు, పుట్టిన తేదీ, అడ్రస్ వంటి వాటిలో తప్పులు ఉంటే సులభంగానే ఆ వివరాలను మార్చుకునే అవకాశం అయితే ఉంటుంది. పేరు, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, జెండర్ వంటి వివరాలను ఇంటినుంచే సులభంగా మార్చుకునే అవకాశాన్ని యూఐడీఏఐ కల్పిస్తోంది. అయితే ఆధార్ కార్డుకు మొబైల్ నంబర్ లింక్ అయ్యి ఉంటే మాత్రమే వివరాలను అప్ డేట్ చేసుకోవడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు.

ఒకవేళ ఆధార్ కార్డుకు మొబైల్ నంబర్ లింక్ కానివాళ్లు మొబైల్ నంబర్ ను లింక్ చేసుకొని ఆ తరువాత వివరాలను అప్ డేట్ చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఆధార్ కార్డులో వివరాలను మార్చుకోవాలని అనుకునే వాళ్లు మొదట సపోర్ట్ డాక్యుమెంట్లను తప్పనిసరిగా సిద్ధం చేసుకోవాలి. ఈ డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయడం ద్వారా సులువుగా వివరాలను మార్చుకోవడం సాధ్యమవుతుంది.

అయితే ఎక్కువసార్లు ఈ వివరాలను మార్చుకోవడం సాధ్యం కాదు. అందువల్ల వివరాలను మార్చుకునే వాళ్లు అన్ని జాగ్రత్తలు తీసుకుని వివరాలను మార్చుకుంటే మంచిది. ఆధార్ వివరాలను అప్ డేట్ చేసుకున్న ప్రతిసారి 50 రూపాయలు చెల్లించి వివరాలను మార్చుకోవాల్సి ఉంటుంది.