Smartphone: నేటి కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ తప్పనిసరిగా ఉంటుంది. అయితే అవసరాలు పెరుగుతుండడంతో పాటు టెక్నాలజీ అప్టేడ్ అవుతుండడంతో కొత్త కొత్త మొబైల్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ధరలు కూడా పెరుగుతున్నాయి. నేటి కాలంలో రూ.20 వేల కంటే తక్కువ ధరకు ఫోన్ రావడం కష్టమే. కానీ ఓ కంపెనీ మాత్రం ఐ ఫోన్ రేంజ్ లో ఫీచర్స్ అందిస్తూనే తక్కువ ధరకు ఓ మొబైల్ ను విక్రయిస్తుంది. దీనిని ఇప్పటికే వరల్డ్ లెవల్లో గతేడాది అక్టోబర్ లో ఆవిష్కరించారు. ఇటీవల భారత్ లో ఆవిష్కరించారు. దీని ఫీచర్స్ గురించి తెలిసి షాక్ అవుతున్నారు.
5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆక్టాకోర్ Unisoc చిప్ సెట్, 64 జీబీ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్ కలిగిన ఫోన్ సాధారణంగా రూ.20,000ల కంటే ఎక్కువే ఉంటుంది. కానీ టెక్నో పాప్ అనే కంపెనీ మాత్రం తక్కువ ధరకే అందిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 6.56 హెచ్ డీ డిస్ ప్లే, 1612 x 720 పిక్సెల్ రిజల్యూషన్, 90 హెచ్ జడ్ రీఫ్రెస్ రేట్ ను కలిగి ఉంది. అచ్చం యాపిల్ ఫోన్ తరహాలోనే డైనమిక్ పోర్ట్ ఫీచర్ ఇందులో ఉండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక 12 ఎంపీ ఏఐ ఆధారిత డ్యూయెల్ కెమెరాతో పాటు వీడియో కాల్స్ కోసం 8 ఎంపీ కెమెరాను కూడా అందిస్తున్నారు.
సౌండ్ విషయానికొస్తే సాధారణ స్మార్ట్ ఫోన్ల కంటే 400 శాతం రెట్టింపు వస్తుంది. ఇందులో డీటీఎస్ స్పీకర్లను అమర్చి ఆకర్షిస్తున్నారు. 10 వాట్ వైర్ ఛార్జర్ సపోర్టు చేసే ఇది 802.11 వైఫై, బ్లూటూత్ 5.0 యూఎస్ బీ చార్జర్ ను కలిగి ఉంది. ఇన్ని ఫీచర్లు అందిస్తున్న దీనిని రూ.6499 తో విక్రయిస్తున్నారు. ప్రారంభ ఆఫర్ల కింద బ్యాంకు ఆపర్ల తో కలిసి రూ.5999 లకే లభించే అవకాశం ఉంది. దీనిని జనవరి 9 నుంచి 12 వరకు అమెజాన్ లో విక్రయించనున్నారు.