Tata Ace Pro New Launch 2025: దేశీయ కార్ల కంపెనీ అయినా టాటా నుంచి ఇప్పటికీ ఎన్నో వాహనాలు మార్కెట్లోకి వచ్చాయి. వాహనాల ఉత్పత్తిలో అగ్రశ్రేణిలో ఉన్న మారుతి కంపెనీకి గట్టి పోటీ ఇచ్చే కంపెనీ ఏదంటే టాటా గురించే ప్రత్యేకంగా చెబుతూ ఉంటారు. టాటా కంపెనీ నుంచి ప్యాసింజర్ వాహనాలు మాత్రమే కాకుండా కమర్షియల్ వాహనాలు ఎక్కువగా మార్కెట్లోకి వచ్చాయి. మిగతా కంపెనీల కంటే దీని నుంచి కమర్షియల్ వాహనాలు ఎక్కువగా వచ్చేవి. 1998 నుంచి టాటా మోటార్స్ ప్రజల్లో బాగా పాపులర్ పొందింది. అయితే తాజాగా కొత్త వాహనాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఈ వాహనం ధర తక్కువగా ఉండడంతో పాటు ఆకర్షణీయంగా ఉండబోతుంది. ఇంతకీ ఆ కారు లేదంటే?
టాటా కంపెనీ నుంచి ప్యాసింజర్ వాహనాలతో పాటు కమర్షియల్ వాహనాలు ఎక్కువగా మార్కెట్లోకి తీసుకొచ్చారు. వీటిలో టాటా ఏస్ వాహనం ఇప్పటికే మార్కెట్లోకి వచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది. తక్కువ మోతాదులో వస్తువులను మోసుకెళ్ళడానికి మీ వాహనం ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు ఈ వాహనం కొత్తగా అప్డేట్ అయి మార్కెట్లోకి రాబోతుంది. ఇటీవల ఎస్ ప్రో పేరిట దీనిని రిలీజ్ చేశారు. గత జనవరిలో ఢిల్లీలో జరిగిన ఎక్స్పోలో ఎస్ ప్రో వాహనాన్ని పరిచయం చేశారు. అయితే ఇటీవల దీనిని మార్కెట్లోకి తీసుకువచ్చారు.
Also Read: TATA Car : మారుతికి గట్టిపోటీ ఇచ్చిన కారు ధర పెరిగింది.. ఎంతో తెలుసా?
కొత్త ఎస్ ప్రో వాహనంలో అనేక ఆకర్షణీయమైన ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ వాహనం 750 కిలోల బరువును తీసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉంది ఇది 1.98 మీటర్ల పొడవు ఉండి. కాస్త పెద్ద వస్తువులను కూడా తీసుకెళ్లే విధంగా డిజైన్ చేశారు. చిన్న మొత్తంలో వస్తువులను తీసుకెళ్లడానికి ఈ వాహనం పటిష్టంగా ఉపయోగపడే విధంగా తయారు చేశారు. ఇది పెట్రోల్ వేరియంట్ లో లభించడంతోపాటు 30 బిహెచ్పి పవర్ తో పాటు 55 ఎంఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా దీనిని సహజవాయువుతో కూడా నడిపే విధంగా డిజైన్ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే పెట్రోల్ ను ఉపయోగించుకోవచ్చు. ఇందులో గరిష్టంగా 38 బిహెచ్పి పవర్, 104 ఎం ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఎలక్ట్రిక్ వాహనం కూడా ఇది అందుబాటులో ఉంది. 67 సర్టిఫైడ్ బ్యాటరీ కలిగిన ఇందులో ఒక్కసారి చార్జింగ్ చేస్తే 1 55 కిలోమీటర్ల దూరం వెళ్లే అవకాశం ఉంటుంది.
కొత్తగా మార్కెట్లోకి వచ్చే ఎస్ ప్రో వాహనం ద్వారా ప్రస్తుతం రూ 3.99 లక్షల ప్రారంభ ధర నుంచి విక్రయిస్తున్నారు. అయితే మిగతా సదుపాయాలు కావాలంటే అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. టాటా కంపెనీ నుంచి ఇప్పటికే ఎన్నో కమర్షియల్ వాహనాలు వచ్చాయి. కానీ కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఎస్ ప్ర వాహనంపై చాలామంది ఆసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా ఇది పెట్రోల్ తో పాటు ఎలక్ట్రిక్ వేరియంటును కలిగి ఉండడంతో రెండు రకాలుగా ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంది. దీంతో ఈ వాహనం అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.