Homeజాతీయ వార్తలుSunita Williams: సునీతా విలియమ్స్‌కు స్వాగతం పలుకుతూ మోదీ ట్వీట్‌ వైరల్!

Sunita Williams: సునీతా విలియమ్స్‌కు స్వాగతం పలుకుతూ మోదీ ట్వీట్‌ వైరల్!

Sunita Williams: నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్‌ మరియు బుచ్‌ విల్మోర్‌ తొమ్మిది నెలల అంతరిక్ష వాసం తర్వాత మార్చి 19న(బుధవారం) తెల్లవారుజామున భూమికి సురక్షితంగా తిరిగి వచ్చారు. అంతరిక్ష నౌకలో సాంకేతిక లోపం కారణంగా వారు ఊహించని విధంగా ఎక్కువ కాలం అంతరిక్షం(ISS)(లో గడపాల్సి వచ్చింది. వారి తిరిగి రాకడం పట్ల ప్రపంచవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) సునీతా విలియమ్స్‌ మరియు బుచ్‌ విల్మోర్‌లకు స్వాగతం పలుకుతూ, ‘భూమి ఇన్నాళ్లూ మిమ్మల్ని మిస్‌ అయింది‘ అని సంతోషం వ్యక్తం చేశారు.
సునీతతో కలిసి ఉన్న ఫొటోను సోషల్‌ మీడియా(Social Media)లో పంచుకుంటూ ప్రధాని మోదీ ఇలా రాశారు..‘స్వాగతం #Crew9! ఇది సహనం, ధైర్యం, మానవ స్ఫూర్తికి నిదర్శనం. సునీతా విలియమ్స్‌ మరియు బుచ్‌ విల్మోర్‌ తమ పట్టుదలతో లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చారు. అంతరిక్ష పరిశోధన అంటే సామర్థ్య సరిహద్దులను అధిగమించడం, కలలు కనడం, వాటిని సాకారం చేసే ధైర్యం కలిగి ఉండటం. సునీతా విలియమ్స్‌ ఒక ఆవిష్కర్త, తన కెరీర్‌లో స్ఫూర్తిదాయక ఐకాన్‌గా నిలిచారు. ఆమె సురక్షితంగా తిరిగి రావడానికి కృషి చేసిన వారందరినీ చూసి గర్వపడుతున్నాను. సాంకేతికతలో ఖచ్చితత్వం, పట్టుదల కలిస్తే ఏం సాధ్యమో ఆమె చూపించారు’ అని పేర్కొన్నారు.

భారత పుత్రికగా అభివర్ణిస్తూ..
సునీతా విలియమ్స్‌ భారత సంతతికి చెందిన వ్యోమగామి. ఇది ఆమెకు మూడో అంతరిక్ష యాత్ర. ఇప్పటివరకు ఆమె అంతరిక్షంలో మొత్తం 608 రోజులు గడిపారు. 1965 సెప్టెంబర్‌ 19న ఒహియోలోని యూక్లిడ్‌లో జన్మించిన సునీత తండ్రి దీపక్‌ పాండ్య గుజరాత్‌లోని మెహ్సానా జిల్లాకు చెందినవారు. అంతరిక్షంలో అత్యధికంగా నడిచిన మహిళగా ఆమె రికార్డు సష్టించారు. 2007, 2013లలో భారత్‌ను సందర్శించిన సునీతకు 2008లో పద్మభూషణ్‌ పురస్కారం లభించింది. ఇటీవల ప్రధాని మోదీ ఆమెకు లేఖ రాసి, ‘భారత పుత్రిక‘గా అభివర్ణించి, భారత్‌కు రావాలని ఆహ్వానించారు. సునీతా విలియమ్స్‌ తిరిగి రాక భారతీయులకు గర్వకారణంగా నిలిచింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular