ఫోన్ పే, గూగుల్ పే లేకుండా డిజిటల్ లావాదేవీలు.. ఎలా అంటే..?

దేశంలోని ప్రజలలో చాలామంది ప్రస్తుతం డిజిటల్ పేమెంట్ల వైపు తెగ ఆసక్తిని చూపుతున్న సంగతి తెలిసిందే. ఫోన్ పే, గూగుల్ పే ద్వారా చాలామంది డిజిటల్ లావాదేవీలను నిర్వహిస్తున్నారు. ఫోన్ పే, గూగుల్ పేలను వినియోగించి లావాదేవీలను చేయడం వల్ల క్యాష్ బ్యాక్ కూడా పొందే అవకాశం అయితే ఉంటుంది. అయితే వీటి కంటే సులభంగా ఆర్థిక లావాదేవీలు నిర్వహించడానికి ఈ – రూపీ అందుబాటులోకి రానుంది. క్యాష్ లెస్, కాంటాక్ట్ లెస్ గా ఈ రూపీని […]

Written By: Navya, Updated On : August 1, 2021 3:24 pm
Follow us on

దేశంలోని ప్రజలలో చాలామంది ప్రస్తుతం డిజిటల్ పేమెంట్ల వైపు తెగ ఆసక్తిని చూపుతున్న సంగతి తెలిసిందే. ఫోన్ పే, గూగుల్ పే ద్వారా చాలామంది డిజిటల్ లావాదేవీలను నిర్వహిస్తున్నారు. ఫోన్ పే, గూగుల్ పేలను వినియోగించి లావాదేవీలను చేయడం వల్ల క్యాష్ బ్యాక్ కూడా పొందే అవకాశం అయితే ఉంటుంది. అయితే వీటి కంటే సులభంగా ఆర్థిక లావాదేవీలు నిర్వహించడానికి ఈ – రూపీ అందుబాటులోకి రానుంది.

క్యాష్ లెస్, కాంటాక్ట్ లెస్ గా ఈ రూపీని రూపొందించడంతో డిజిటల్ లావాదేవీలు నిర్వహించేవాళ్లకు ప్రయోజనం చేకూరనుంది. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ రూపీని రూపొందించగా 2021 సంవత్సరం ఆగష్టు నెల 2వ తేదీ నుంచి ఇది అమల్లోకి రానుండటం గమనార్హం. ఈ రూపీ ద్వారా కేంద్రం నుంచి ఆర్థిక సాయం పొందేవాళ్లకు బ్యాంకు ఖాతాలు అవసరం లేకుండానే సహాయం అందనుంది.

నగదు లబ్ధిదారులకు, ఎం.ఎం.ఎస్ వోచర్, క్యూఆర్ కోడ్ రూపంలో చేరనుంది. లబ్దిదారుడు అవసరమైన చోట క్యూఆర్ కోడ్ ను వినియోగించే అవకాశం ఉంటుంది. కేంద్రం డిజిటల్ లావాదేవీలను వేగవంతం చేయాలని భావించి ఈ – రూపీ యాప్ ను అమల్లోకి తెస్తున్నట్లు వెల్లడించడం గమనార్హం. ఆయుష్మాన్ భారత్ ప్రధాన జన్ ఆరోగ్య యోజనా పథకంలో భాగంగా ప్రతినెలా టీబీ రోగులకు ఔషధాలను అందిస్తోంది.

మాతా శిశు అభివృద్ధి పథకం ద్వారా కేంద్రం రైతులకు సబ్సిడీ కింద ఎరువులను ఇవ్వడంతో పాటు పౌష్టికాహారం ఇవ్వనుంది. రాబోయే రోజుల్లో ఈ రూపే ద్వారా కేంద్రం పైన పేర్కొన్న పథకాలకు సంబంధించిన ఆర్థిక సహాయాన్ని అందించనుండటం గమనార్హం.