https://oktelugu.com/

Phone Pay : గూగుల్, యాపిల్ కు పోటీగా ఫోన్ పే.. ఇక వారికి పండగే పండగ

ఫోన్ పే ఈ నిర్ణయం తీసుకోవడంతో కార్పొరేట్ ప్రపంచంలో ఒక్కసారిగా సంచలనం చెలరేగింది. మరి దీనిపై యాపిల్, గూగుల్ ఎలా స్పందిస్తాయో వేచి చూడాల్సి ఉంది.

Written By:
  • Rocky
  • , Updated On : September 23, 2023 9:07 pm
    -phonepe-upi

    -phonepe-upi

    Follow us on

    Phone Pay : సాధారణంగా ఏ విభాగంలోనైనా పోటీ ఉంటేనే రసవత్తరంగా ఉంటుంది. ముఖ్యంగా కార్పొరేట్ ప్రపంచంలో పోటీ అనేది ఉంటేనే వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందుతాయి. వారు వెచ్చించే ప్రతి పైసాకు న్యాయం జరుగుతుంది. పైగా అందే సేవలో వైవిధ్యం ఉంటుంది. ఒకవేళ సేవలు నచ్చని పక్షంలో మరొక సంస్థను ఆశ్రయించే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుత స్మార్ట్ ఫోన్ యుగంలో అప్లికేషన్లకు సంబంధించి ఆండ్రాయిడ్ యూజర్లు కేవలం గూగుల్ ప్లే స్టోర్ మీదనే ఆధారపడతారు. యాపిల్ యూజర్లైతే ఐఓఎస్ ను ఆశ్రయిస్తారు. అయితే మన దేశంలో చాలామంది ఈ యాపిల్ ఫోన్ల కంటే ఆండ్రాయిడ్ ఫోన్లు వాడుతారు. ఇందుకు కారణం ఆండ్రాయిడ్ ఫోన్ల ధర తక్కువగా ఉండటమే. ఆండ్రాయిడ్ ఫోన్లో సంబంధించి యాప్స్ డౌన్లోడ్ చేయాలంటే గూగుల్ ప్లే స్టోర్ మాత్రమే దిక్కు. ఈ క్రమంలో యాప్స్ మార్కెట్లో గూగుల్ చెప్పిందే వేదం. అయితే యాప్స్ డెవలపర్లకు నుంచి ఆ కష్టాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే వారికి ఫోన్పే గుడ్ న్యూస్ చెప్పింది.

    డిజిటల్ చెల్లింపుల్లో రారాజుగా ఉన్న ఫోన్ పే సరికొత్త వ్యాపారానికి తెరతీసింది. ఇప్పటివరకు డిజిటల్ చెల్లింపుల వరకే పరిమితమైన కంపెనీ మరో కొత్త రంగంలోకి అడుగుపెడుతోంది. యాప్ డెవలపర్ల కోసం ఇండస్ యాప్ స్టోర్ పేరిట కొత్త వేదికను ప్రారంభించనుంది. ఈ స్టోర్లో తమ అప్లికేషన్లను లిఫ్ట్ చేయాలని డెవలపర్లను కోరింది. 12 స్థానిక భాషల్లో ఈ యాప్ స్టోర్ త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని ఫోన్ పే పెంచింది. ప్రస్తుతం యాప్ స్టోర్ల విషయంలో గూగుల్, యాపిల్ గుత్తాధిపత్యం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆ సంస్థలకు సవాల్ విసిరేందుకు ఫోన్ పే సిద్ధమైంది.

    డెవలపర్లు తమ యాప్స్ ను ఇండస్ యాప్ స్టోర్ లో లిస్ట్ చేసుకోవాలని ఫోన్ పే కోరింది. www. Indus app store.com వెబ్ సైట్ ద్వారా యాప్స్ ఆప్ లోడ్ చేసుకోవాలని సూచించింది. తొలి ఏడాది తాము డెవలపర్ల నుంచి ఎటువంటి ఫీజు వసూలు చేయబోమని ఫోన్ పే ప్రకటించింది. కేవలం స్వల్ప మొత్తంలో ఫీజు మాత్రమే వసూలు చేస్తామని వివరించింది. యాప్ డెవలపర్ల నుంచి ఎటువంటి ఫ్లాట్ ఫామ్ ఫీజు గానీ, ఇన్_ యాప్ పేమెంట్స్ కు కమీషన్ గానీ చేయమని స్పష్టం చేసింది. అంతేకాకుండా తమకు నచ్చిన పేమెంట్ గేట్ వే ను ఉచితంగా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చని వివరించింది. ఫోన్ పే ఈ నిర్ణయం తీసుకోవడంతో కార్పొరేట్ ప్రపంచంలో ఒక్కసారిగా సంచలనం చెలరేగింది. మరి దీనిపై యాపిల్, గూగుల్ ఎలా స్పందిస్తాయో వేచి చూడాల్సి ఉంది.