Lava Blaze Amoled 2 5G: మార్కెట్లోకి ఎన్నో రకాల మొబైల్స్ వస్తుంటాయి. కొందరు హై రేంజ్ ఉన్న ఫోన్లు కొనుగోలు చేయాలని చూస్తే.. మరికొందరు బడ్జెట్లో కొనాలని అనుకుంటారు. ఇలాంటి వారి కోసం కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా మార్కెట్లోకి తక్కువ ధరలు మొబైల్స్ ను ప్రవేశ పెడుతూ ఉంటాయి. వీటిలో LAVA కంపెనీకి చెందిన మొబైల్స్ ఇప్పటికే మార్కెట్లోకి వచ్చి చాలామందిని ఆకట్టుకున్నాయి. లేటెస్ట్ గా ఆకట్టుకునే ఫీచర్స్ తో.. మెరుగైన బ్యాటరీ సామర్థ్యం ఉన్న మొబైల్ ఒకటి సందడి చేస్తోంది. ఇది అప్డేట్ అయిన టెక్నాలజీతో రాబోతుంది. ఈ మొబైల్ పూర్తి వివరాల్లోకి వెళితే..
LAVA కంపెనీకి చెందిన కొత్త మొబైల్ Blaze Amoled 2 5G smartphone తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా డిస్ప్లే గురించి చెప్పుకోవచ్చు. ఇది బడ్జెట్ ఫోన్ అయినప్పటికీ ఇందులో 6.67 అంగుళాల HD+ డిస్ప్లేతో సపోర్ట్ చేస్తుంది. ఇది IP 64 రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. అలాగే ఇందులో అప్డేట్ అయిన సాఫ్ట్వేర్ను అమర్చారు. మీడియా టెక్ dimensity 7060 చిప్ సెట్ ఉండనుంది. 6 జిబి రామ్, 128gb స్టోరేజ్ కలిగి ఉన్న ఇది 15 ఆధారిత OS పైన పనిచేస్తుంది. రెండు సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్డేట్ను అందిస్తుంది.
ఈ మొబైల్లో బలమైన బ్యాటరీని చేర్చారు.5000 mAh ఉండడంతో దీనికి 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. రోజువారి వినియోగంతో పాటు మల్టీ టాస్కింగ్ కోసం ఫోను వాడేవారికి ఎక్కువసేపు చార్జింగ్ ఉండే అవకాశం ఉంది. అలాగే డౌన్ టైం కూడా తక్కువగా ఉండడంతో గేమింగ్ కోరుకునే వారికి కూడా చార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది. ఈ కొత్త మొబైల్ లో కెమెరా పనితీరు కూడా మెరుగ్గా ఉందని చెప్పవచ్చు. ఇందులో 50 MP మెయిన్ కెమెరాను అమర్చారు. అలాగే 8 MP ఫ్రంట్ కెమెరా ఉండగానే ఉంది. డ్యూయల్ వ్యూ తో ఉండే ఈ కెమెరాతో ఏఐ ఆధారిత ఫోటోలను తీసుకోవచ్చు. అలాగే లెడ్ ఫ్లాష్ లైట్ కూడా ఏర్పాటు చేయడంతో పగలు, రాత్రి అని సమయం లేకుండా కావాల్సిన ఫోటోలు వస్తాయి.
5జి కనెక్టివిటీ వేగవంతంగా ఉండడంతో ఇంటర్నెట్ యూస్ చేసేవారికి సపోర్ట్ గా ఉంటుంది. అలాగే బ్లూటూత్ 5.2, యుఎస్బి సీ పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఆడియో కోసం స్టీరియో స్పీకర్ కూడా చేర్చారు. ఇక ఈ మొబైల్ ను అతి తక్కువ ధరకే అందించనున్నారు. రూ.13,400 తో అమెజాన్ లో దీనిని కొనుగోలు చేయవచ్చు. అయితే ఫెథర్ వైట్ కలర్ కావాలంటే కాస్త ఎక్కువ చెల్లించాలి.