Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీIndia Cyber Security Innovation: ఈ టెక్నాలజీతో హ్యాకింగ్ కుదరదు.. భారత శాస్త్రవేత్తలు సాధించిన విజయం...

India Cyber Security Innovation: ఈ టెక్నాలజీతో హ్యాకింగ్ కుదరదు.. భారత శాస్త్రవేత్తలు సాధించిన విజయం మామూలుది కాదు

India cyber security Innovation: సున్నాను కనిపెట్టాం. ప్రపంచానికి ఒక దిశను చూపించాం. నలంద, తక్షశిల ద్వారా ప్రపంచానికి జ్ఞానాన్ని పరిచయం చేశాం. వేదాల ద్వారా సామరస్యాన్ని నిరూపించాం. ఉపనిషత్తుల ద్వారా ప్రపంచ గమనాన్ని ఎలా ఉండాలో నిర్దేశించాం. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచం మీద భారతీయులు వేసిన ముద్ర మామూలుది కాదు.

అందుకే భారతీయులు విశ్వవిజ్ఞాన సంపన్నులు. మనకు సామరస్యం మాత్రమే తెలుసు. సుసంపన్నం మాత్రమే మనకు తెలుసు. అందువల్లే విశ్వవిజ్ఞాన భాండాగారంగా.. ప్రపంచానికి జ్ఞాన దారిని చూపించిన దేశంగా భారత్ పేరుపొందింది. ప్రపంచం మొత్తం సాంకేతిక రంగం వైపు ఇప్పుడు పరుగులు తీస్తోంది కానీ.. ఒకప్పుడు సాంకేతికతను ప్రపంచానికి పరిచయం చేసింది భారతదేశం. సనాతన సాంప్రదాయాన్ని సాంకేతికతకు జోడించి ప్రపంచ గమనాన్ని మార్చేసింది భారత్. ఇప్పుడు ఈ నవీన కాలంలోనూ సరికొత్త ఆవిష్కరణలను తెరపైకి తెస్తూ సాంకేతికతకు సరికొత్త అర్ధాన్ని చెబుతున్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జమానా నడుస్తున్న ఈ కాలంలో క్వాంటం కమ్యూనికేషన్లో భారత్ చేసిన ప్రయోగం విజయవంతమైంది. తద్వారా ప్రపంచం మొత్తం మన వైపు చూసే విధంగా శాస్త్రవేత్తలు చేశారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో క్వాంటం కమ్యూనికేషన్లో భవిష్యత్ కాలంలో పెను మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.

Also Read:  Phone Hacking: సింపుల్ గా ఈ ట్రిక్ తో మీ ఫోన్ హ్యాక్ అయ్యిందో లేదో ఇలా తెలుసుకోండి..

ఇంతకీ ఏం ప్రయోగాలు చేశారంటే?

మనిషి మనుగడ స్మార్ట్ పరికరాల ఆధారంగా సాగుతున్న నేపథ్యంలో హ్యాకింగ్ అనేది తెరపైకి వచ్చింది. శత్రువులను తుద ముట్టించడానికి వాడే ఈ ప్రక్రియ ఇప్పుడు అందరి చేతుల్లోకి వెళ్లిపోయింది. ముఖ్యంగా దేశాల మధ్య అనిచ్చితి వాతావరణం ఏర్పడినప్పుడు హ్యాకింగ్ అనేది సర్వసాధారణంగా మారిపోయింది. ఈ క్రమంలో హ్యాకింగ్ బారినపడి చాలా దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. అందులో భారత్ మినహాయింపు కాదు. ఇటీవల ఆపరేషన్ సిందూర్ కొనసాగినప్పుడు ఉగ్రవాద దేశానికి చెందిన దుర్మార్గులు ఇతర దేశాల్లో ఉంటూ.. మనపై సైబర్ దాడులు చేశారు. ఒకరకంగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే వివిధ సైట్లపై హ్యాకింగ్ చేశారు. అయితే మన సర్వర్లు.. ఫైర్ వాల్స్ అత్యంత పటిష్టంగా ఉండడంతో శత్రువుల పాచికలు పారలేదు.

క్వాంటం కమ్యూనికేషన్ పై..

హ్యాకింగ్ వల్ల ఎప్పటికైనా ఇబ్బంది అని భావించిన మన నిపుణులు.. క్వాంటం కమ్యూనికేషన్ ఆధారంగా ప్రయోగాలు చేశారు. క్వాంటం కమ్యూనికేషన్లో డిఆర్డిఓ, ఇది ఐఐటి శాస్త్రవేత్తలు సమీకంగా చేసిన ప్రయోగాలు విజయవంతమయ్యాయి. తద్వారా ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన సమాచార బదిలీ విధానంలో భారత శాస్త్రవేత్తలు కీలక అడుగులు వేశారు. ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వల్ల సమాచారం మార్పిడి వేగంగా సాగుతుంది. అంతేకాకుండా హ్యాకింగ్ చేయడానికి ప్రత్యర్థులకు అవకాశం ఉండదు. డేటా మార్పిడి కూడా అత్యంత సులువుగా ఉంటుంది. ఇక ఈ సాంకేతిక పరిజ్ఞానం కాంతి అణువు (ఫోటాన్) ఆధారంగా సాగుతూ ఉంటుంది. దాని ఆధారంగానే సమాచారాన్ని చేరవేయడానికి ఆస్కారం ఉంటుంది. శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం విజయవంతం కావడంతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ అభినందించారు. ఇది క్వాంటం కమ్యూనికేషన్లో భారత్ వేసిన కీలక అడుగు అని కొనియాడారు.. ఈ విభాగంలో మరిన్ని ప్రయోగాలు చేస్తామని ఆయన పేర్కొన్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version