Homeలైఫ్ స్టైల్Video creator career tips: వీడియో క్రియేటర్లు అవుదామనుకుంటున్నారా.. ఈ కథనం మీకోసమే

Video creator career tips: వీడియో క్రియేటర్లు అవుదామనుకుంటున్నారా.. ఈ కథనం మీకోసమే

Video creator career tips: నేటి కాలంలో చదివిన చదువుకు.. చేసే ఉద్యోగానికి సంబంధం ఉండడం లేదు. ఎందుకంటే చదువు వేరు.. వ్యాపకం వేరు. ఒకప్పుడు వ్యాపకాల వల్ల కాలక్షేపం జరిగేది. ఒత్తిడి నుంచి మనసుకు విశ్రాంతి లభించేది. కానీ, ఇప్పుడు వ్యాపకాలు మనిషికి కాలక్షేపాన్ని కలిగిస్తున్నాయి. ఒత్తిడి నుంచి దూరం పెడుతున్నాయి. అంతకుమించి ఆదాయాన్ని అందిస్తున్నాయి.

పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం వల్ల ప్రపంచం మొత్తం మారిపోయింది. ప్రతి అంశం కూడా వింతగా మారిపోయింది. కొన్ని అవసరాలు కూడా సాంకేతిక పరిజ్ఞానం నుంచి పుట్టుకొచ్చాయి. అందువల్ల ఆదాయ మార్గాలు పెరిగిపోయాయి. వాటి ద్వారా ఆదాయాన్ని ఆర్జించేవారు సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. ఎంతోమందిని ప్రభావితం చేయగలుగుతున్నారు. ఇలా ప్రభావితం చేయగలుగుతున్న వాటిల్లో వీడియో క్రియేటివిటీ ముందు వరుసలో ఉంది.

వీడియో క్రియేటివిటీ అనేది నైపుణ్యంతో చేసే పని. ఇందులో ఎంత నైపుణ్యం సాధిస్తే.. అంతస్థాయిలో పేరు తెచ్చుకోవచ్చు. ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధి చెందడంలో వీడియో క్రియేటివిటీలో కొత్త కొత్త మార్పులు వచ్చాయి.. ఇన్ స్టా గ్రామ్, యూ ట్యూబ్, ఫేస్ బుక్, ఎక్స్ లో వీడియో క్రియేటర్లు సంచలనాలు సృష్టిస్తున్నారు. రీల్స్, షార్ట్ లలో నవ్యతను చూపిస్తూ అదరగొడుతున్నారు. ఇలా తమ వీడియోలలో నవ్యతను సృష్టించే క్రియేటర్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఎందుకంటే జనాలు ఎప్పటికీ కొత్తదనాన్ని కోరుకుంటున్నారు కాబట్టి.. అటువంటి కొత్తదానాన్ని చూపించే వారికి విలువ పెరిగిపోతున్నది.

వీడియోలలో క్రియేటివిటీ తో పాటు టెక్నాలజీని వాడుకోవడం ఇటీవల పెరిగిపోయింది. అయితే వీడియో లో క్రియేటివిటీ చూపించాలంటే కచ్చితంగా దానికి పరికరాలు కావాలి. ఒకప్పుడు అంటే స్టూడియో.. ఇతర పరికరాలు అవసరమయ్యేది. ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధి చెందిన నేపథ్యంలో.. కొన్ని పరికరాలతో అద్భుతాలు సృష్టించవచ్చు. ప్రొఫెషనల్ స్థాయికి మించి వీడియోలను రూపొందించవచ్చు.

ట్రైపాడ్

ప్రస్తుతం వస్తున్న ఫోన్లలో అత్యంత క్వాలిటీ ఉన్న కెమెరాలు ఉన్నాయి. క్వాలిటీ కెమెరాలకు ఐఫోనే కావాల్సిన అవసరం లేదు. ఒక మాదిరి ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా కూడా సూపర్ వీడియో తీయొచ్చు. అయితే ట్రైపాడ్ ద్వారా కుదుపులు లేకుండా వీడియో రూపొందించవచ్చు. లైవ్ టెలికాస్ట్ కోసం మినీ ఎల్ఈడి.. మైక్రోఫోన్.. ఫోన్ క్లిప్ ఉన్న ట్రైపాడ్ కూడా అందుబాటులోకి వచ్చాయి.

లేపుల్ మైక్

మైక్రోఫోన్లు ఆడియోను నూటికి నూరు శాతం గ్రహించలేవు. అనవసరమైన శబ్దాలను అరికట్టలేవు. నాయిస్ క్యాన్సిలేషన్ సౌలభ్యం ఉన్న మైకులు అనవసరమైన శబ్దాలను అరికడతాయి. ఆడియో క్వాలిటీ కూడా పెంచుతాయి. అవుట్ డోర్ ప్రాంతంలో షూటింగ్ చేస్తున్నప్పుడు.. అనవసరమైన ధ్వనులను ఇవి అరికడతాయి. వ్లాగ్ చేసే వాళ్లకు హాండ్స్ ఫ్రీ.. బ్లూటూత్ లేపుల్ వాడుకోవచ్చు. ఇక ఇండోర్లో షూటింగ్ చేస్తే వైర్ సదుపాయం ఉన్న మైకులు ఉపయుప్తంగా ఉంటాయి.

రింగ్ లైట్

వీడియో ప్రొఫెషనల్ స్థాయిలో కనిపించాలంటే.. దానికి కచ్చితంగా రింగ్ లైట్ ఉండాలి. ఇండోర్ ప్రాంతంలో షూట్ చేస్తున్నప్పుడు కాంతి స్థిరంగా ఉండడానికి.. హైఎండ్ క్వాలిటీ ఉన్న రింగ్ లైట్ కొనుగోలు చేస్తే చాలా బాగుంటుంది. మేకప్.. ఫ్యాషన్.. ఇతర రంగాలకు సంబంధించిన కంటెంట్ సృష్టికర్తలకు ఇది చాలా అవసరం.

పోర్టబుల్ పవర్ బ్యాంకు

వ్లాగ్ చేసే వాళ్లకు.. టూర్లకు వెళ్లే వాళ్లకు.. వీడియో తీయడానికి పవర్ బ్యాంకు ఉపయోగకరంగా ఉంటుంది. పెద్ద పెద్ద వీడియోలు తీస్తున్నప్పుడు ఫోన్లో బ్యాటరీ త్వరగానే నిండుకుంటుంది. అప్పుడు చార్జింగ్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. అలాంటి సమస్యల నుంచి పరిష్కారం పొందాలంటే 20000 mah నుంచి 27,000 ఎంఏహెచ్ పవర్ బ్యాంకు కచ్చితంగా పక్కన పెట్టుకోవాలి.

ఎస్డి కార్డు లేదా పోర్టబుల్ స్టోరేజీ

కంటెంట్ క్రియేటర్లకు తగినంత మెమొరీ కార్డు కంపల్సరీ ఉండాలి. కీలకమైన వీడియో తీస్తున్నప్పుడు.. మెమరీ లేకపోతే ఇబ్బంది ఎదురు కావాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్స్టర్నల్ డ్రైవ్ లేదా అదనపు మెమొరీ కార్డు వంటి సదుపాయం ఉన్న పోర్టబుల్ స్టోరేజీ పరికరాలు కచ్చితంగా ఉండాలి. బ్యాకప్ కూడా చాలా అవసరం కాబట్టి.. అత్యంత తేలికైన ఫైళ్లను బదిలీ చేయడానికి అవి అనుకూలంగా ఉంటాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version