ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి గజగజా వణికిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారా కరోనా కేసులు అంతకంతకూ తగ్గుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ప్రస్తుతం కరోనా కేసులు తక్కువ సంఖ్యలో నమోదవుతున్న సంగతి తెలిసిందే. వ్యాక్సినేషన్ ప్రక్రియ ద్వారా కరోనాను తరిమికొట్టే ప్రయత్నాలు మన దేశంతో పాటు ప్రపంచ దేశాల్లో సైతం జరుగుతున్నాయి.

అయితే కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లకు వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఎంతో ముఖ్యమనే విషయం తెలిసిందే. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ఉంటే మాత్రమే ఇతర దేశాలకు వెళ్లే అవకాశంతో పాటు ప్రముఖ దేవాలయాలకు వెళ్లాలన్నా వ్యాక్సిన్ సర్టిఫికెట్ కచ్చితంగా ఉండాల్సిందే. అయితే ఇంటర్నెట్ పై అవగాహన లేనివాళ్లు వాట్సాప్ ద్వారా వ్యాక్సిన్ సర్టిఫికెట్ తీసుకునే విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం తాజాగా సులభంగా కరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్ ను పొందే అవకాశాన్ని కల్పిస్తుండటం గమనార్హం. కొన్ని సింపుల్ స్టెప్స్ ద్వారా కరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్ ను సులభంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం మొదట మొబైల్ ఫోన్ లో 9013151515 అనే నంబర్ ను సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కరోనా సర్టిఫికెట్ అని టైప్ చేసి వాట్సాప్ నంబర్ కు మెసేజ్ ను పంపించాల్సి ఉంటుంది.
ఆ తర్వాత వన్ టైమ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేసి ఆ వన్ టైమ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేయాలి. ఈ విధంగా సులభంగా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ను పొందవచ్చు. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్లకు వ్యాక్సిన్ సర్టిఫికెట్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.