AI – Google Maps : గూగుల్ మ్యాప్స్ లో జనరేటివ్ ఏఐ.. ఇంతకీ ఇది ఎలా పనిచేస్తుందంటే..

దీంతో గూగుల్ సంస్థ దానిపై ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ఇటీవల చాట్ జిపిటిని ప్రారంభించడం ద్వారా ఓపెన్ ఏఐ "జనరేటివ్ ఏఐ" విషయంలో ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు గూగుల్ కూడా జనరేటివ్ ఏఐ టూల్స్ లాంచ్ చేసింది.

Written By: NARESH, Updated On : April 15, 2024 3:08 pm

AI - Google Maps

Follow us on

AI – Google Maps : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం ప్రతి రంగంలోనూ పెరిగిపోతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా పెద్ద పెద్ద టెక్ కంపెనీలు ఈ టెక్నాలజీ పై దృష్టి సారించాయి.. ఈ నేపథ్యంలో ఇతర సంస్థల నుంచి పోటీని తట్టుకునేందుకు గూగుల్ జనరేటివ్ ఏఐ ని వాడుతోంది. ఇప్పటికే జనరేటివ్ ఏఐని ఓపెన్ ఏఐ, మెటా వంటి సంస్థలు ఉపయోగిస్తున్నాయి. దీంతో గూగుల్ సంస్థ దానిపై ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ఇటీవల చాట్ జిపిటిని ప్రారంభించడం ద్వారా ఓపెన్ ఏఐ “జనరేటివ్ ఏఐ” విషయంలో ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు గూగుల్ కూడా జనరేటివ్ ఏఐ టూల్స్ లాంచ్ చేసింది.

చాట్ జిపిటికి పోటీగా జెమినీని అందుబాటులోకి తీసుకువచ్చింది. దానిని మర్చిపోకముందే నానో పవర్డ్ పిక్సెల్ ఫీచర్లు, ఇమేజ్ జనరేట్ చేసే “ఇమేజ్ 2 మోడల్” వంటి అడ్వాన్స్డ్ ఫీచర్లను జెమినీలో పొందుపరిచింది. గూగుల్ అక్కడితోనే ఆగలేదు..తన మ్యాప్స్ అప్లికేషన్లో పటిష్టమైన పునాదిని వేసేందుకు జనరేటివ్ ఏఐ ఫీచర్లను పొందుపరిచింది. ఈ ఫీచర్ ద్వారా గూగుల్ మ్యాప్స్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ను అందిస్తాయని ఆ సంస్థ చెబుతోంది. గూగుల్ మ్యాప్స్ దాదాపు 250 మిలియన్ స్థలాలకు సంబంధించిన సమాచారం, 300 మిలియన్ కాంట్రిబ్యూటర్స్ జాబితాను అనలైజ్ చేయగలుగుతుంది. రెస్టారెంట్లు, మెడికల్ షాపులు, సినిమా హాళ్ళు వంటి వాటిని రికమెండ్ చేస్తుంది. అక్కడితోనే కాదు గూగుల్ మ్యాప్స్ ద్వారా ఇతర ప్రాంతాలకు వెళ్తున్న వారికి పురాతన కట్టడాలు, చారిత్రాత్మక ప్రదేశాలు వంటి వాటిని కూడా ప్రస్తావిస్తుంది.. “ఏ వింటేజ్ వైబ్స్” అని టైప్ చేసి దాని పక్కన మీరు ఉన్న ప్రాంతాన్ని పొందుపరిస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ మ్యాప్స్ కమ్యూనిటీ నుంచి ఫోటోలు, రేటింగ్స్, రివ్యూలు, సమీపంలోని వ్యాపార ప్రాంతాల గురించి స్పష్టమైన సమాచారాన్ని అందిస్తాయి.. విలువైన సూచనలు కూడా చేస్తాయి.

ఫోటో కేరోసెల్స్, రివ్యూ తో పాటు క్లాతింగ్ స్టోర్స్, వినైల్ షాప్స్, ఫ్లీ మార్కెట్లు వంటి ఆర్గనైజ్డ్ కేటగిరీలను కూడా వినియోగదారులకు చూసే అవకాశం కల్పిస్తోంది గూగుల్. జనరేటివ్ ఏఐ ఫీచర్ మొదట్లో యునైటెడ్ స్టేట్స్ లో మాత్రమే అందుబాటులో ఉంది.. దీని పనితీరు బాగుండడం.. యూజర్ ల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడానికి గూగుల్ ప్లాన్ చేస్తోంది. ” ఇది ప్రస్తుతానికి మ్యాప్స్ కమ్యూనిటీలో అత్యంత యాక్టివ్, ఫ్యాషనేట్ గా ఉండే లోకల్ గైడ్స్ కి మాత్రమే అందుబాటులో ఉంటుంది. అనంతరం దశలవారీగా మిగతా వారికి అందుబాటులోకి వస్తుందని” గూగుల్ ప్రకటించింది. ఓపెన్ ఏఐ ని మ్యాప్స్ వరకే పరిమితం చేయబోమని.. ఇతర రంగాల్లోకూ అనుసంధానం చేస్తామని గూగుల్ చెబుతోంది.