Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీRobot beats Human: రోబోల ముందు మనుషులు ఓడిపోయారు.. ఇకపై ఈ భూమి మొత్తం మర...

Robot beats Human: రోబోల ముందు మనుషులు ఓడిపోయారు.. ఇకపై ఈ భూమి మొత్తం మర మనుషులదే

Robot beats Human: సరిగ్గా కొన్ని సంవత్సరాల క్రితం శంకర్ దర్శకత్వంలో రోబో అనే ఒక సినిమా వచ్చింది గుర్తుందా. ఆ సినిమాలో డాక్టర్ వశీకర్ తయారుచేసిన రోబో చివరికి అతడినే చంపడానికి ప్రయత్నిస్తుంది.. ముప్పు తిప్పలు పెట్టి, మూడు చెరువుల నీళ్లు తాగిస్తుంది. చివరికి రోబో నుంచి తనను తాను రక్షించుకున్న వశీకర్.. తాను సృష్టించిన రోబోను దేనికీ పనికిరాకుండా చేస్తాడు. ఇక హాలీవుడ్ సినిమాల్లో అయితే మనుషులు సృష్టించిన రోబోలు.. మనుషులనే అంతం చేస్తాయి. సైన్స్ ఫిక్షన్ ఆధారంగా రూపొందించిన ఆ సినిమాలు అద్భుతమైన ఆదరణ పొందాయి. రీల్ లైఫ్ లో ఇటువంటి సాధ్యమవుతాయి. కానీ రియల్ లైఫ్ లో అంత ఈజీ కాదు.

రియల్ లైఫ్ లో రోబోలు మనుషులను దాటేస్తాయని.. మనుషులను అత్యంత సులువుగా అధిగమిస్తాయని చైనాలో జరిగిన ఘటన ద్వారా తెలిసిపోయింది. చైనాలో హ్యూమనాయిడ్ రోబోలతో పరుగు పందెం పోటీలు నిర్వహించారు. ఆ పోటీలలో రోబోలు దుమ్మురేపాయి. మనుషులను మించి పరుగు పెట్టి ఓడించాయి. మనుషుల కంటే వేగంగా పరుగు తీసి రికార్డు సృష్టించాయి. కేవలం 50 నిమిషాల 26 సెకండ్లలో 21 కిలోమీటర్ల పరుగును ఒక రోబో పూర్తి చేసింది. అంతేకాదు మొదటి, రెండు, మూడు స్థానాల్లో కూడా రోబోలు నిలవడం గమనార్హం.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఇప్పటివరకు అమెరికా కంపెనీలు ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే ఈ రంగంలో సత్తా చూపించాలని చైనా కొంతకాలంగా భావిస్తుంది. దానికి తగ్గట్టుగానే ప్రణాళికలు రూపొందించింది. ఈ నేపథ్యంలోనే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ మొత్తాన్ని ఆధునికరించింది. దీనికోసం భార్య ఖర్చు పెడుతుంది. ఈ నేపథ్యంలోనే బీజింగ్ ప్రాంతంలో పరుగు పందెం పోటీ నిర్వహించింది. హ్యూమన్, రోబో లతో సంయుక్తంగా ఈ పోటీలు నిర్వహించింది. ఈ పోటీలకు 12,000 మంది మనుషులు హాజరయ్యారు. 100కు పైగా రోబోలు పోటీలో పాల్గొన్నాయి. మొత్తంగా 21.1 కిలోమీటర్ల దూరం 50 నిమిషాల 26 సెకండ్లలో లైటనింగ్ రోబో పూర్తి చేసింది. 51 నిమిషాలలో మరొక రోబో.. 53 నిమిషాలలో మరో రోబో తమ పరుగు పందాన్ని పూర్తిచేశాయి. తొలి మూడు స్థానాల్లో ఇవి నిలవడం విశేషం.

చైనా దేశానికి చెందిన హానర్ అనే కంపెనీ లైటనింగ్ రోబోను రూపొందించింది. పరుగులు పెట్టే సమయంలో రోబో నుంచి శక్తి వెలువడుతుంది. దానిని నియంత్రించడానికి ఫోన్లో ఉపయోగించే అడ్వాన్స్ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీని ఇందులో ఉపయోగించారు. రోబో కోసం పరుగు పెట్టడానికి సులభంగా 90 నుంచి 90 సెంటీమీటర్ల పొడవుతో ప్రత్యేకమైన కాళ్లను రూపొందించారు. ఈ పోటీలో పాల్గొన్న మనుషులు తమ లక్ష్యాన్ని పూర్తి చేయడానికి ఒక గంట ఏడు నిమిషాల 47 సెకండ్ల సమయాన్ని తీసుకున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version