WPL 2026 Mega Auction: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఈసారి వరల్డ్ కప్ విన్నర్లకు కాసుల పంట పండింది. అందులో ముఖ్యంగా టీమ్ ఇండియా ఆల్ రౌండర్ దీప్తి శర్మకు అదిరి పోయే స్థాయిలో ధర దక్కింది. వన్డే ప్రపంచ కప్ టోర్నీలో ఉమెన్ ఆఫ్ ది సిరీస్ పురస్కారాన్ని దక్కించుకున్న తను.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మెగా వేలంలో అదిరిపోయే ధర తగ్గించుకుంది. తను గతంలో ఆడిన యూపీ వారియర్స్ యాజమాన్యం దీప్తి శర్మ మీద కనక వర్షం కురిపించింది…
ఢిల్లీ వేదికగా జరిగిన మెగా వేలంలో దీప్తి శర్మను రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారా యూపీ వారియర్స్ యాజమాన్యం సొంతం చేసుకుంది. ఈ వేలంలో దీప్తి 50 లక్షల కానీస ధరతో పేరు నమోదు చేసుకుంది. దీప్తి కోసం ఢిల్లీ జట్టు బిడ్ వేసింది. మిగతా యాజమాన్యాలు అంతగా ఆమె మీద ఆసక్తి చూపించలేదు. అయితే ఊహించని విధంగా యూపీ వారియర్స్ యాజమాన్యం రైట్ టు మ్యాచ్ కార్డు ఉపయోగించింది. తద్వారా ఢిల్లీ యాజమాన్యం దీప్తి శర్మ కోసం 3.20 కోట్లతో బిడ్ వేసింది. ఆ ధరను చెల్లించడానికి యూపీ యాజమాన్యం అంగీకారం తెలపడంతో.. దీప్తి మీద కనక వర్షం కురిసింది.
గత సీజన్లో దీప్తికి యుపి యాజమాన్యం 2.60 కోట్లు చెల్లించింది. కానీ మెగా వేయడానికి ముందు యూపీ వారియర్స్ యాజమాన్యం దీప్తిని చేసుకోలేదు. అయితే చివరికి యూపీ యాజమాన్యమే 3.20 కోట్లకు ఆమెను తిరిగి జట్టులోకి తీసుకుంది. తద్వారా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధిక ధర పలికిన రెండవ ప్లేయర్ గా దీప్తి రికార్డు సృష్టించింది. గతంలో స్మృతి ని బెంగళూరు యాజమాన్యం 3.4 కోట్లకు దక్కించుకుంది.
దీప్తి శర్మ మహిళల వన్డే వరల్డ్ కప్ లో అద్భుతంగా ఆడింది. 215 పరుగులు చేసింది. 22 వికెట్లు కూడా సొంతం చేసుకుంది.. టీమిండియా వరల్డ్ కప్ సాధించడంలో దీప్తి ముఖ్యపాత్ర పోషించింది. ఫైనల్ మ్యాచ్లో ఆమె ఆడిన తీరు అద్భుతం.. అనన్యసామాన్యం. అందువల్లే ఆమెకు వేలంలో విపరీతమైన ధర లభించింది.