WPL 2026 Mega Auction: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా నిర్వహించిన మెగా వేలంలో ఈసారి విదేశీ ప్లేయర్లలో దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్స్ సంచలనం సృష్టించింది. మెగా వేలంలో లారా వోల్వార్డ్స్ సరికొత్త ధరను దక్కించుకుంది. ఢిల్లీలో జరిగిన మెగా వేలంలో ఢిల్లీ యాజమాన్యం లారా వోల్వార్డ్స్ ను 1.10 కోట్లకు దక్కించుకుంది.
మెగా వేలంలో లారా వోల్వార్డ్స్ 30 లక్షల కనీస ధరను ఆమె తన పేరు మీద నమోదు చేసుకుంది. ఈమె కోసం బెంగళూరు, ఢిల్లీ యాజమాన్యాలు నువ్వానేనా అన్నట్టుగా పోటీ పడ్డాయి. చివరికి ఢిల్లీ యాజమాన్యం 1.10 కోట్లకు దక్కించుకుంది. లారా 2023 లో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లోకి ప్రవేశించింది. గుజరాత్ జట్టు తరఫున ఆడిన తను 125.75 స్ట్రైక్ రేట్ తో ఏకంగా 342 పరుగులు చేసింది. అదే ఏడాది బెత్ మూనీ గాయపడిన నేపథ్యంలో జట్టులోకి వచ్చింది లారా. విధ్వంసకరమైన ప్లేయర్ అయినప్పటికీ ఆమెకు జట్టులో చోటు లభించలేదు.. అరుదుగా మాత్రమే అవకాశాలు వచ్చాయి. 30 లక్షల కనీస ధరతో లారా మూడు సీజన్లలో ఆడింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఆమె అంతగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ.. మహిళల వన్డే వరల్డ్ కప్ లో మాత్రం దుమ్ము రేపింది. ఫైనల్ మ్యాచ్లో తన అనితర సాధ్యమైన బ్యాటింగ్ తో అదరగొట్టింది. సూపర్ సెంచరీ తో తన అద్భుతమైన ఫామ్ ను మరోసారి ప్రదర్శించింది. మహిళల వన్డే వరల్డ్ కప్ లో 571 పరుగులు చేసి సంచలనం సృష్టించింది.
వన్డే వరల్డ్ కప్ లో లారా అదరగొట్టిన నేపథ్యంలోనే ఆమెను కొనుగోలు చేయడానికి యాజమాన్యాలు విపరీతమైన ఆసక్తిని ప్రదర్శించాయి. చివరికి ఢిల్లీ జట్టు ఆమెను సొంతం చేసుకుంది. లారా వన్డే వరల్డ్ కప్ లో వారియర్ లాగా ప్రదర్శన చేసింది.. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్లో ఆమె వీరోచిత పోరాటం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకవేళ చివరి వరకు లారా క్రీజ్ లో ఉండి ఉంటే మ్యాచ్ ఫలితం మరో విధంగా ఉండేదేమో. సెంచరీ చేసిన తర్వాత భారీ షాట్ కొట్టిన లారా.. అమన్ జ్యోత్ కౌర్ పట్టిన క్యాచ్ కు అవుట్ అయింది. లారా ఫిట్నెస్ అద్భుతంగా ఉంటుంది. ప్రతి మ్యాచ్ లోనూ సూపర్ విమెన్ స్థాయిలో బ్యాటింగ్ చేసింది.
లారాను ఢిల్లీ యాజమాన్యం కొనుగోలు చేసిన నేపథ్యంలో.. 2026 ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ సీజన్ లో ఢిల్లీ జట్టుకు కెప్టెన్ ను చేస్తారేమోనని అంచనాలు వినిపిస్తున్నాయి. జాతీయ మీడియాలో కూడా లారా గురించి విపరీతమైన చర్చ నడుస్తుంది. ఢిల్లీ జట్టు సారధిగా ఆమెను నియమించడానికే ఈ స్థాయిలో ధర చెల్లించిందని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ లారా గనక ఢిల్లీ జట్టుకు సారధి అయితే అప్పుడు పరిస్థితి వేరే విధంగా ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.