WPL 2025 RCB Vs DC: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL 2025) లో బెంగళూరు జట్టు (royal challengers Bangalore) దూకుడు కొనసాగిస్తోంది. తొలి మ్యాచ్ భారీ టార్గెట్ చేదించిన ఆ జట్టు.. రెండో మ్యాచ్ లోనూ అదే లీడ్ కొనసాగించింది.. ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi capitals) తో జరిగిన మ్యాచ్లో బౌలర్లు రేణుకా సింగ్ (3/23), జార్జియా వేర్హమ్ (3/25) అదరగొట్టారు.
ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ముందుగా బ్యాటింగ్ చేసింది. 19.3 ఓవర్లలో 141 పరుగులకే ఆల్ అవుట్ అయింది.. జెమీమా రోడ్రిగ్స్(34) పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచింది. ఇక మిగతా బ్యాటర్లు అత్యంత దారుణంగా విఫలమయ్యారు.. రేణుక, జార్జియా, కిమ్ గార్త్, ఎక్త్ బిష్త్ తలా రెండు వికెట్లు సాధించారు. టాస్ ఓడిన ఢిల్లీ జట్టు కు ప్రారంభంలోనే అదిరిపోయే షాక్ తగిలింది. ఓపెనర్ షెఫాలి వర్మ (0) ను రేణుకా సింగ్ గోల్డెన్ డక్ గా వెనక్కి పంపించింది. మరో ఓపెనర్ కెప్టెన్ మెక్ లానింగ్ తో కలిసి జెమీమా దూకుడుగా ఆడింది. మెక్ లానింగ్ ఫోర్లు కొట్టడంతో ఢిల్లీ జట్టు పవర్ ప్లే లో ఒక్క వికెట్ కోల్పోయి 55 రన్స్ చేసింది. అయితే జోడి ప్రమాదకరంగా మారడంతో.. రేణుక అద్భుతమైన బంతివేసి జెమీమా ను పెవిలియన్ చేర్చింది. ఆ తర్వాత సదర్ ల్యాండ్ ఆచితూచి ఆడింది.. ఈ క్రమంలో మెక్ లానింగ్ ను కిమ్ గార్త్ వెనక్కి పంపించింది.. ఇదే క్రమంలో మరిజన్నే కామ్, సరా బ్రైస్, రాధా యాదవ్, తెలుగు ప్లేయర్ అరుంధతి రెడ్డి (4) పూర్తిగా నిరాశపరిచారు. దీంతో ఢిల్లీ ఇన్నింగ్స్ 141 పరుగుల వద్ద ముగిసింది.
అందువల్లే మేము ఓడిపోయాం..
ఢిల్లీ జట్టు విధించిన 142 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు సులువుగా చేరింది. 16.2 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 146 పరుగులు చేసి సులువైన విజయాన్ని సొంతం చేసుకుంది. కెప్టెన్ స్మృతి మందాన (81) పరుగులతో మైదానంలో విధ్వంసం సృష్టించింది.. మరో ఓపెనర్ డాని వ్యాట్ హోడ్జ్(42) వెంట్రుక వాసిలో హాఫ్ సెంచరీ కోల్పోయినప్పటికీ.. ఎలిస్ ఫెర్రీ (7*), రీఛా గోష్ (11*) తదుపరి లాంఛనాన్ని పూర్తి చేశారు. రిచా భార్య సిక్సర్ కొట్టి మ్యాచ్ ను ముగించింది. ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోవడంతో.. ఆ జట్టు కోచ్ జోనాథన్ బాటి విచారణ వ్యక్తం చేశారు. జెమీమా రోడ్రిగ్స్, మెక్ లానింగ్ రెండో వికెట్ కు 50 పరుగులు జోడించారని.. ఆ తర్వాత ఆ స్థాయిలో భాగస్వామ్యాలు నమోదు కాలేదని.. అందువల్లే తక్కువ స్కోరు చేశామని పేర్కొన్నారు..”ఈ మైదానంలో 170 పరుగులు చేస్తేనే గెలుపు సాధ్యమవుతుంది. మా జట్టు 141 పరుగుల వద్ద ఆగిపోయింది. మా బ్యాటింగ్ యూనిట్లో లోపాలు ఉన్నాయి. భాగస్వామ్యాలు నమోదు కాలేదు. అందువల్లే ఈ స్థాయిలో ఓటమి ఎదురయింది. మేము చాలా తక్కువ పరుగులు చేశాం. పవర్ ప్లే లో ఒక వికెట్ నష్టానికి 55 పరుగులు చేశాం. ఆ తర్వాత అదే జోరు కొనసాగించలేకపోయాం. అందువల్లే ఓటమి ఎదురయిందని” పేర్కొన్నారు.