World Chess Championship 2024: అప్పుడెప్పుడో విశ్వనాథన్ ఆనంద్ ప్రపంచ చెస్ ఛాంపియన్ గా నిలిచాడు. ద్రోణవల్లి హారిక, హరికృష్ణ, హంపి లాంటి హేమాహేమీలు కూడా ప్రపంచ చెస్ ఛాంపియన్ గా నిలవలేకపోయారు. కానీ 18 సంవత్సరాల గుకేష్ ఆ ఘనతను అందుకున్నాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు.
గుకేష్ చైనాకు చెందిన డింగ్ లిరెన్ ను ఓడించి.. ప్రపంచ ఛాంపియన్ గా అవతరించాడు. గుకేష్ వయసు ప్రస్తుతం 18 సంవత్సరాల వయసు. అతడు ప్రపంచ చెస్ ఛాంపియన్ గేమ్ లో 14వ ( చివరి గేమ్) గేమ్ లో లిరెన్ ను ఓడించాడు. ప్రపంచ ఛాంపియన్ గా నిలిచాడు. మనదేశంలో ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ ను గెలుచుకున్న తొలి క్రీడాకారుడిగా విశ్వనాథన్ ఆనంద్ అప్పట్లో రికార్డు సృష్టించారు. ఇప్పుడు అతడి తర్వాత గుకేష్ నిలిచాడు. గుకేష్ ప్రారంభం నుంచి దూకుడు కొనసాగించలేకపోయినప్పటికీ.. అవసరమైన సందర్భాల్లో గేమ్ లు గెలిచాడు. అందువల్లే విజేతగా నిలిచాడు.. వాస్తవానికి ఈ టోర్నీలో గుకేష్ ప్రయాణం నల్లేరు మీద నడక లాగా సాగలేదు. ప్రారంభంలో గుకేష్ వెనుకబడ్డాడు. కొన్నిసార్లు డ్రా చేసుకున్నాడు. ఆ తర్వాత గేమ్ లు గెలిచాడు. తద్వారా ప్రపంచ చెస్ ఛాంపియన్ గా అవతరించాడు. ముఖ్యంగా ఈ టోర్నీలో చివరిదైన 14 వ గేమ్ లో విజయం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాడు. 2023లో లిరెన్ విజయం సాధించాడు. అప్పుడు జరిగిన ప్రపంచ ఛాంపియన్ షిప్ టోర్నీలో రష్యా ఆటగాడు ఇయాన్ నెపోమ్నియా తో జరిగిన అస్థిరమైన మ్యాచ్ లో ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నాడు. తద్వారా ప్రపంచ చెస్ ఛాంపియన్ గా అవతరించాడు. అయితే ఈసారి మాత్రం గుకేష్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.
ఇలా మొదలైంది ప్రయాణం
గుకేష్ ప్రపంచ చెస్ ఛాంపియన్ ప్రయాణం గత ఏడాది డిసెంబర్ లో మొదలైంది. డిసెంబర్ నెలలో చెన్నై గ్రాండ్ మాస్టర్స్ టోర్నీలో గుకేష్ విజయం సాధించాడు. ఆ గెలుపు ద్వారా గుకేష్ క్యాండిడేట్స్ టోర్నమెంట్ లో చేరాడు. అప్పటినుంచి అతడు తన ప్రపంచ చెస్ ఛాంపియన్ ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఆటోర్నీలో అమెరికన్ జోడి ఫాభియానో కరువానా, హికారు నకమూరా బలమైన పోటీదారులుగా ఉన్నారు. ఆ టోర్నీలో గుకేష్ అందరినీ ఓడించాడు. చదరంగంలో సునామీని సృష్టించాడు. గుకేష్ ఓడించిన వారిలో ప్రజ్ఞానంద కూడా ఉన్నాడు. ప్రపంచ చెస్ ఛాంపియన్ ట్రోఫీ లో 14వ గేమ్ లో గుకేష్ తీవ్ర పోటీ ఎదుర్కొన్నాడు.. అయితే ఆ గేమ్ లో డింగ్ లిరెన్ చేసిన తప్పిదం అతడికి భారీ నష్టాన్ని మిగిల్చింది. దానిని తనకు అవకాశం గా మలుచుకున్న గుకేష్ లిరెన్ ఎత్తులకు పై ఎత్తులు వేశాడు. మొత్తంగా 18వ ప్రపంచ చెస్ ఛాంపియన్ గా నిలిచాడు. సింగపూర్ లో ఈ టోర్నీ జరిగింది. ప్రారంభం నుంచి లిరెన్, గుకేష్ హోరాహోరీగా పోరాడారు. అయితే అంతిమంగా గుకేష్ విజయం సాధించాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ చెస్ ఛాంపియన్ గా గుకేష్ ఆవిర్భవించాడు.. ప్రపంచంలోనే చేసి ఛాంపియన్ గా నిలిచిన అత్యంత పిన్న వయసున్న ఆటగాడిగా గుకేష్ సరికొత్త రికార్డు సృష్టించాడు.
THE EMOTIONS…!!! ❤️
– 18 Year Old Gukesh Dommaraju creating history by becoming the youngest ever champion. pic.twitter.com/LVkA8JMKM1
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 12, 2024
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: World chess championship 2024 gukesh dommaraju becomes youngest world champion breaks kasparovs record
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com