https://oktelugu.com/

India Vs Sri Lanka: ఫైనల్లో ఇషాన్ కిషన్ ఉంటాడా లేదా శ్రేయాస్ అయ్యర్ వస్తాడా…?

ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు అంత ఫామ్ లో లేడు ఇక అతన్ని టెస్ట్ చేస్తూ కూర్చోడానికి ఇది నార్మల్ మ్యాచ్ అయితే కాదు. కాబట్టి ఈ క్రిటికల్ మ్యాచ్ లో మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడే సత్తా ఉన్న ఇషాన్ కిషన్ ని నెంబర్ ఫైవ్ లో తీసుకుంటారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : September 17, 2023 / 12:11 PM IST

    India Vs Sri Lanka

    Follow us on

    India Vs Sri Lanka: ఇండియా శ్రీలంక టీమ్ ల మధ్య జరిగే ఏషియా కప్ ఫైనల్ మ్యాచ్ లో గెలుపు కోసం రెండు జట్లు విపరీతమైన కసరత్తులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే శ్రీలంక టీం తనదైన రీతిలో ఇండియన్ ప్లేయర్లని ఎలా ఎదుర్కోవాలో దానికి సంబంధించిన అన్ని వ్యూహాలను రెడీ చేసుకుని పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఇండియా టీం కూడా శ్రీలంక టీం ని ఓడించడానికి ఏ విధమైన మార్గంలో వెళ్తే బాగుంటుంది అనే దానికి సంబంధించిన ప్లానింగ్స్ ని రెడీ చేసుకుంది. అయితే ఇండియా టీం లో ప్రస్తుతం ఆడుతున్న ప్లేయర్లలో అందరూ కూడా చాలా మంచి ఫామ్ లో ఉన్నారు. ఇక ఇలాంటి టైంలో ఇషాన్ కిషన్ ప్లేస్ లో శ్రేయస్ అయ్యర్ ని తీసుకుంటారు అనే ఒక విషయమైతే విపరీతంగా వినిపిస్తుంది. కానీ ఇషాన్ కిషన్ ప్లేస్ లో శ్రేయాస్ అయ్యర్ టీంలోకి వస్తాడు అనేది అవాస్తవం.

    ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు అంత ఫామ్ లో లేడు ఇక అతన్ని టెస్ట్ చేస్తూ కూర్చోడానికి ఇది నార్మల్ మ్యాచ్ అయితే కాదు. కాబట్టి ఈ క్రిటికల్ మ్యాచ్ లో మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడే సత్తా ఉన్న ఇషాన్ కిషన్ ని నెంబర్ ఫైవ్ లో తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పటికే ఇషాన్ కిషన్ గత మ్యాచ్ ల్లో మంచి పర్ఫామెన్స్ ఇస్తూ వస్తున్నాడు. ఆయాన్ని తీసుకోవడానికి ఇదొక రీజన్ అయితే ఇంకొక రిజన్ నెంబర్ 5 లో ఆయన లేకపోతే ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ లో నెంబర్ 6 వరకి ఒక లెఫ్ట్ హండర్ ప్లేయర్ కూడా లేడు కాబట్టి నెంబర్ ఫైవ్ లో ఇషాన్ కిషన్ ఆడడం కరెక్ట్… ఆయన ఆడితేనే ఇండియా ఫైనల్ మ్యాచ్ గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. శ్రేయాస్ అయ్యర్ అద్భుతమైన ప్లేయర్ అయినప్పటికీ ప్రస్తుతం అంత మంచి ఫామ్ లో లేడు శ్రేయస్ అయ్యర్ వరల్డ్ కప్ టీం లో సెలెక్ట్ అయి ఉన్నాడు కాబట్టి ఆయన చేత కొన్ని మ్యాచ్ లు ఆడించాలి కానీ ఈ ఫైనల్ మ్యాచ్ ఆడించడం కరెక్ట్ కాదు…ఇక ఈ కప్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియాతో ఒక సిరీస్ ఉంది దాంట్లో అతన్ని తీసుకుంటే బెటర్ అంతేకానీ ఫైనల్ మ్యాచ్ లో ఆయనని తీసుకొని తప్పు చేయడం కరెక్ట్ కాదు…..