India Vs Sri Lanka: శ్రీలంక ఇండియా టీంల మధ్య జరిగిన మ్యాచ్ లో మనవాళ్ళు బ్యాటింగ్ పరంగా చాలా దారుణంగా ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. ఇంతకు ముందు పాకిస్థాన్ మీద ఆడినప్పుడు మాత్రం ఇద్దరు ఓపెనర్లు అయినా రోహిత్ శర్మ, శుభమన్ గిల్ ఇద్దరు కూడా హాఫ్ సెంచరీ చేసి మంచి ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని ఇచ్చారు కానీ నిన్న జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేసినప్పటికీ శ్రీలంక బౌలర్ల చేతిలో కొంతవరకు తడబడినట్టు గా తెలుస్తుంది.ఇక వీళ్ల తరువాత క్రీజ్ లోకి వచ్చిన కోహ్లీ మరి దారుణంగా సింగల్ డిజిట్ స్కోర్ మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. పాకిస్థాన్ మీద సెంచరీ చేసి వన్డే కెరియర్ లో 47 వ సెంచరీ చేసిన కోహ్లీ ఈ మ్యాచ్ లో మాత్రం దారుణంగా ఫెయిల్ అయ్యాడు అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన ఆడిన ప్రతి మ్యాచ్ లో కూడా ఎంతో కొంత రన్స్ చేసి ఇండియా టీం ఎక్కువ స్కోర్ చేయడం లో తన వంతు పాత్ర పోషిస్తూ ఉంటాడు అలాంటి కొహ్లీ నిన్న చాలా తక్కువ స్కోర్ కి అవుట్ అవ్వడం నిజంగా చాలా భాదని కల్గించే విషయం అనే చెప్పాలి.ఇక కె ఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ ఇద్దరు కూడా కొంత వరకు టీం స్కోర్ ని చక్కదిద్దే పనిలో వాళ్ళ వంతు గా వాళ్ళ స్కోర్ ని వాళ్ళు చేయడం జరిగింది.
ఇక మొన్న పాకిస్థాన్ మీద విరుచుపడి ఆడిన ఇండియా టీం బ్యాట్స్ మెన్స్ నిన్న శ్రీలంక మీద మాత్రం చాలా
గోరమైన పెర్ఫామెన్స్ ఇవ్వడం చాలా దురదృష్టకరం అనే చెప్పాలి.ఇక ఈ మ్యాచ్ లో ఇంకా ఐదు బాల్స్ మిగిలి ఉండగానే మన టీం ఆల్ అవుట్ అవ్వడం జరిగింది.అయితే ఇదంతా చూసిన సీనియర్ క్రికెట్ మేధావులుసైతం ఎందుకు ఇండియా పాకిస్థాన్ మీద విరుచుపడి ఆడింది, శ్రీలంక మీద మాత్రం చాలా తడబడుతూ ఆడింది అని అసలు ఇండియా టీం ఏ టైం లో ఎలా ఆడుతుందో ఎవ్వరికి తెలియడం లేదు అని అభిప్రాయపడుతున్నారు. నిజానికి శ్రీలంక బౌలింగ్ తో పోల్చుకుంటే పాకిస్థాన్ బౌలింగ్ చాలా స్ట్రాంగ్ అయినా కూడా పాకిస్థాన్ బౌలర్లు కు చుక్కలు చూపించిన మన ప్లేయర్లు శ్రీలంక బౌలర్ల ముందు ఎందుకు తేలిపోయారు అనేదే ఇక్కడ అర్థం కానీ విషయం…ఇక ఇప్పుడు అనే కాదు శ్రీలంక స్పిన్ బౌలర్లని ఎదుర్కోవడం లో ఇండియన్ ప్లేయర్లు ఇంతకుముందు కూడా ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. అజంతా మెండిస్ ఇండియా మీద ఆడిన మొదటి మ్యాచ్ లో ఆయన బౌలింగ్ లోనే టాప్ బ్యాట్స్ మెన్స్ అందరు అవుట్ అవ్వడం జరిగింది.13 రన్స్ ఇచ్చి ఆరు వికెట్లు తీసాడు…అలాగే నిన్న దునిత్ వెల్లలాగే బౌలింగ్ లో కూడా స్త్ర ప్లేయర్లు అందరు అవుట్ అయ్యారు…
నిన్న ఆడిన పిచ్ స్పిన్ కి అనుకూలించేది అయినప్పటికీ శ్రీలంక బ్యాట్స్ మెన్స్ మన స్పిన్ బౌలర్లను కొంత వరకు బాగానే ఎదురుకున్నారు.మరి మనవాళ్ళు మాత్రమే వాళ్ళ స్పిన్ బౌలర్లని ఆడటానికి చాలా సతమతమయ్యారు.ఇక ఈ మ్యాచ్ ని పక్కన పెడితే నెక్స్ట్ జరగబోయే ఫైనల్ కి ఎవరు చేరుకుంటున్నారు అనేది తెలియాలి శ్రీలంక టీం ఫైనల్ కి వస్తే మనవాళ్ళు నిన్న జరిగిన మ్యాచులోనే వాళ్ళ ని ఎదుర్కోవడానికి చాలా ఇబ్బందులు పడ్డారు ఇక వాళ్ళు ఫైనల్ కి వస్తే మరి ఫైనల్ లోవాళ్ళని ఎలా ఎదురుకుంటారు అనేది చూడాలి…