Cricket in Olympics: క్రికెట్ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక మన దేశంలో అయితే చిన్న వారి నుంచి పెద్ద వారి దాకా అందరికీ క్రికెట్ అంటే పిచ్చి అనే చెప్పుకోవాలి. అయితే ఇంత ఫేమస్ అయిన క్రికెట్‌ను మాత్రం ఒలంపిక్స్‌లో ఎందుకు చేర్చలేదన్నది పెద్ద ప్రశ్న. అయితే క్రికెట్ మొదట్లో ఒలంపిక్స్‌లో ఉండేది. కచ్చితంగా ఉండాలనే నిబంధన కూడా ఉంది.
1896లో మోడ్రన్ ఒలంపిక్స్ స్టార్ట్ అయినప్పుడు క్రికెట్ ఆడాలని పెట్టారు. కానీ ఏ దేశం కూడా ఆడేందుకు ముందుకు రాలేదు. రిజిస్టర్ చేయించుకోలేదు. ఇక 1900 సంవత్సరంలో ప్యారిస్‌లో జరిగిన ఒలంపిక్స్‌లో కూడా కేవలం ఇంగ్లండ్, ఫ్రాన్స్ దేశాలు మాత్రమే ఆడాయి. ఈ రెండింటి మధ్య ఒకే ఒక్క మ్యాచ్ జరగ్గా ఇంగ్లండ్‌కు గోల్డ్ మెడల్, ఫ్రాన్స్ కు సిల్వర్ మెడల్ దక్కాయి.
Also Read: ఇక లంకతో సిరీస్: టీమిండియా పని పడుతుందా?
కాగా 1904వ సంవత్సరంలో అయితే ఏ దేశం కూడా ఒలంపిక్స్ ఆడేందుకు ముందుకు రాలేదు. ఇలా నెమ్మదిగా క్రికెట్ అనేది ఒలంపిక్స్ నుంచి తప్పుకుంది. అయితే ఒలంపిక్స్ లో ఆ తర్వాత కూడా ఒలంపిక్స్‌లో క్రికెట్ లేకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. క్రికెట్ ఆడని దేశంలో ఒలంపిక్స్ జరిగితే.. దీని కోసం ప్రత్యేకంగా స్టేడియాన్ని కట్టాల్సి ఉంటుంది.
ఆ దేశం వాళ్లు కూడా దీన్ని చూసేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపరు. పైగా క్రికెట్ అనేది కేవలం అభివృద్ధి చెందిన కొన్ని దేశాల్లో మాత్రమే ఆడతారు. అమెరికా, రష్యా, జపాన్, చైనా, ఇటలీ, బ్రెజిల్, ఇతర అభివృద్ధి చెందిన పెద్ద దేశాల్లో క్రికెట్‌ను ఎవరూ ఆడరు. పైగా 106 దేశాల్లో క్రికెట్ ఆడుతున్నా కూడా.. కేవలం 12 దేశాలు మాత్రమే ఐసీసీలో ఫుల్ మెంబర్స్ గా ఉన్నాయి. అయితే ఈ 12దేశాలు కూడా ఒలంపిక్స్ లో క్రికెట్ ను ఆడించాలని కోరట్లేదు. అయితే ఐసీసీ 2028లో టీ20 ఫార్మాట్ లో ఒలంపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపింది. అది సక్సెస్ అయితే మళ్లీ క్రికెట్‌ను ఒలంపిక్స్‌లో చూడొచ్చు.
Also Read: గల్లీలో అధికారం కోసమే కేసీఆర్ ఢిల్లీ వెళుతున్నారా?