https://oktelugu.com/

T20 World Cup Winner: వరుసగా 10 మ్యాచ్ లు ఓడి.. ప్రపంచకప్ ను ఆస్ట్రేలియా ఎలా సాధించింది?

T20 World Cup Winner: టీ20 ప్రపంచకప్ ఆరంభానికి ముందు అసలు ఆస్ట్రేలియా ఈ కప్ కొడుతుందని ఎవ్వరూ ఊహించలేరు. అంతా టీమిండియా, పాకిస్తాన్, వెస్టిండీస్, ఇంగ్లండ్ లకు ఛాన్స్ ఉందని అన్నారు. కానీ ట్రెయిన్ రివర్స్ అయ్యింది.ఎవ్వరూ ఊహించని చాంపియన్ అవతరించింది. ప్రపంచకప్ టీ20కి ముందు వరుసగా 10 టీ20లు ఓడిపోయిన ఆస్ట్రేలియా ఈ కప్ కొడుతుందని అసలు ఎవరూ ఊహించలేదు. ద్వైపాక్షిక సిరీస్ లలో ఇండియా సహా బంగ్లాదేశ్ చేతిలోనూ ఆస్ట్రేలియా ఓడిపోయింది. టెస్టుల్లోనూ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 15, 2021 / 08:57 AM IST
    Follow us on

    T20 World Cup Winner: టీ20 ప్రపంచకప్ ఆరంభానికి ముందు అసలు ఆస్ట్రేలియా ఈ కప్ కొడుతుందని ఎవ్వరూ ఊహించలేరు. అంతా టీమిండియా, పాకిస్తాన్, వెస్టిండీస్, ఇంగ్లండ్ లకు ఛాన్స్ ఉందని అన్నారు. కానీ ట్రెయిన్ రివర్స్ అయ్యింది.ఎవ్వరూ ఊహించని చాంపియన్ అవతరించింది.

    world cup 2021 winner

    ప్రపంచకప్ టీ20కి ముందు వరుసగా 10 టీ20లు ఓడిపోయిన ఆస్ట్రేలియా ఈ కప్ కొడుతుందని అసలు ఎవరూ ఊహించలేదు. ద్వైపాక్షిక సిరీస్ లలో ఇండియా సహా బంగ్లాదేశ్ చేతిలోనూ ఆస్ట్రేలియా ఓడిపోయింది. టెస్టుల్లోనూ తేలిపోయింది. వన్డేల్లో ఆపసోపాలు పడింది. ఇక టీ20ల్లో ఆస్ట్రేలియాది చెత్త రికార్డు. ప్రపంచకప్ వరకూ వారి ప్రదర్శన అంతంతమాత్రమే. కానీ తనపై ఎవరికి అంచనాలు లేకుండా చేసి ఏకంగా కప్ కొట్టేసింది. జట్టు సభ్యులు కూడా తాము కప్ కొడుతామని అనుకోలేదు. కానీ కొట్టేశారు.. ప్రపంచకప్ టీ20 కొత్త విజేతగా ఆస్ట్రేలియా ఆవిర్భవించింది. ఫైనల్ లో న్యూజిలాండ్ చిత్తు అయ్యింది.

    ప్రపంచంలోని అన్ని టీ20 జట్లతో పోలిస్తే ఆస్ట్రేలియాలో అసలు హిట్టర్లు, స్పెషలిస్టులు లేనే లేరు. ప్రపంచవ్యాప్తంగా వివిధ లీగ్ లలో ఆడిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఇప్పుడు కప్ కొట్టేశారు. ఐపీఎల్ సహా బిగ్ బాష్ ఇతర ప్రధాన లీగ్ లలో ఆడేవారి అనుభవం ఆస్ట్రేలియాకు వరం అయ్యింది. డేవిడ్ వార్నర్, మ్యాక్స్ వెల్, మార్ష్, స్టాయినిస్, కమిన్స్, స్టార్క్ , స్టీవ్ స్మిత్ ఇలా అందరూ ఐపీఎల్ సహా వివిధ లీగుల్లో ఆడి ఆరితేరారు. అదే ఇప్పుడు ఆస్ట్రేలియా విజయానికి ఆయువు పట్టుగా మారింది.

    గత రెండేళ్లలో చూసుకుంటే టీ20 క్రికెట్లో పేలవ ప్రదర్శన చేసింది ఆస్ట్రేలియా జట్టు. వరుసగా 5 టీ20 సిరీస్ లను ఆ జట్టు కోల్పోయిందంటే వారు ఎంత చెత్తగా ఆడారో అర్థం చేసుకోవచ్చు. టీ20 క్రికెట్ చరిత్రలో తొలిసారి బంగ్లాదేశ్ చేతిలోనూ ఆస్ట్రేలియా ఓడిపోయింది.

    ఈ కప్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా బ్యాటింగ్ కు ప్రధాన బలమైన వార్నర్, ఫించ్ పేలవ ఫామ్ లో ఉండడం.. బౌలర్లు రాణించకపోవడం.. వార్నప్ మ్యాచ్ లో టీమిండియా చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోవడంతో అసలు ఈ ప్రపంచకప్ లో ఆస్ట్రేలియాను ఎవరూ ఫేవరేట్ అనలేదు. కానీ అంచనాల్లేకుండా అడుగుపెట్టి ఆస్ట్రేలియా కప్ కొట్టిందంటే ఆటగాళ్ల బలమైన ప్రదర్శననే కారణం.

    ప్రపంచకప్ టీ20లో ఇంగ్లండ్ చేతిలో 125కే కుప్పకూలి ఆస్ట్రేలియా ఓడింది. దక్షిణాఫ్రికాపై 119 పరుగులు చేధించడానికి ఆపసోపాలు పడింది. శ్రీలంకపై కూడా అతి కష్టం మీద గెలిచింది. ఆస్ట్రేలియా పని అయిపోయిందనుకుంటున్న వేళ బంగ్లాదేశ్, వెస్టిండీస్ పై భారీ రన్ రేట్ తో విజయం సాధించింది. ముఖ్యంగా డేవిడ్ వార్నర్ సరైన సమయంలో ఫామ్ లోకి రావడం ఆ జట్టుకు బాగా ప్లస్ అయ్యింది. అతడు ప్రతి మ్యాచ్ లోనూ ఆస్ట్రేలియా బ్యాటింగ్ కు వెన్నెముకగా నిలిచి కప్ కొట్టడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక మిచెల్ మార్స్ వన్ డౌన్ లో పెట్టని గోడలా.. బౌలర్ గా మారి ఫైనల్ లోనూ ఆస్ట్రేలియాను గెలిపించి చరిత్ర సృష్టించాడు. బౌలర్లు హేజిల్ వుడ్, స్టార్క్, కమిన్స్, జంపాలు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో అసీస్ రోజురోజు బలంగా తయారైంది. సెమీస్ లో బలమైన పాకిస్తాన్ ను సైతం ఓడించి సత్తా చాటింది.

    జట్టు కూర్పు సరిగ్గా కుదరడం ఆస్ట్రేలియా గెలుపునకు ప్రధాన కారణమైంది. వార్నర్, ఫించ్, మార్స్, మాక్స్ వెల్, స్మిత్, స్టాయినిస్, వేడ్ వరకూ బ్యాటింగ్ ఉండి అందరూ ఒక్కో మ్యాచ్ లో అదరగొట్టడంతో ఆస్ట్రేలియా విశ్వవిజేతగా నిలిచింది. కొంత అదృష్టం కూడా పాకిస్తాన్ తో సెమీస్ లో కలిసి వచ్చి ఫైనల్ చేరింది. ఫైనల్ లో తమకు అనువైన ప్రత్యర్థి న్యూజిలాండ్ ను ఓడించి కప్ కొట్టేసింది.

    ముఖ్యమైన మ్యాచ్ లో ప్రతికూల పరిస్థితుల్లో ఎదురైనా కూడా టీమిండియాలా డీలా పడకుండా కుంగిపోకుండా పుంజుకోవడం ఆస్ట్రేలియా అలవర్చుకున్న గొప్ప లక్షణం. అదే చాంపియన్ గా నిలిపింది. ఆ లక్షణంతోనే ఆస్ట్రేలియా ప్రపంచకప్ సాధించింది. టీమిండియాలో లేనిది.. ఆస్ట్రేలియాలో ఉన్నది ఆత్మస్థైర్యం. అదే గెలుపునకు సోపానమైంది.