Site icon OkTelugu

Vaibhav Suryavanshi Orange Cap IPL 2026: వైభవ్ సూర్యవంశీ..15 ఏళ్లకే ఆరెంజ్ క్యాప్.. నీ దూకుడు చూస్తుంటే ఎవరికీ క్యాప్ లు మిగిలనిచ్చేలా లేవు

Vaibhav Suryavanshi Orange Cap IPL 2026

Vaibhav Suryavanshi Orange Cap IPL 2026

Vaibhav Suryavanshi Orange Cap IPL 2026: ఎవడైనా బలంగా కొడతాడు. గట్టిగా కొడతాడు. కానీ ఈ 15 సంవత్సరాల బాలుడు బలంగా కొడుతున్నాడు. అందులో శ్రద్ధను చూపిస్తున్నాడు. గట్టిగా కొడుతున్నాడు. అందులో తన దూకుడు తనాన్ని ప్రదర్శిస్తున్నాడు. భయం అనేది తన డిక్షనరీలో లేదన్నట్టుగా.. బెదురు అనే పదం తనకు తెలియనట్టుగా ఆడుతున్నాడు. ఈ స్థాయిలో అతడు ఆడుతుంటే రికార్డులు బద్దలవుతున్నాయి. బంతులు న్యూటన్ మూడవ గమన నియమాన్ని పక్కనపెట్టి స్టాండ్స్ లోకి దూసుకుపోతున్నాయి. నాన్ స్ట్రైకర్ బ్యాటర్లకు పని లేకుండా పోతోంది. మైదానంలో ఉన్న ప్రేక్షకులకు డీజే డ్యాన్స్ అలవాటైపోతుంది. బంతులు వేస్తున్న బౌలర్లకు అలుపువస్తోంది. ఫీల్డింగ్ చేస్తున్న వాళ్లకు నిద్ర వస్తుంది. ఎందుకంటే బంతిని ఆపాల్సిన అవసరం లేదు. నేరుగా అది స్టాండ్స్ లోకి వెళ్తోంది.

Also Read: వైభవ్ సూర్య వంశీ.. వరల్డ్ క్రికెట్ సెన్సేషన్ ఊరికే అవలేదు.. దాని వెనుక కన్నీళ్లు పెట్టించే త్యాగం

ఇంతకంటే ఇంకా గొప్పగా రావచ్చు. మరింత ఉపమానాలను జోడించి.. ఉత్ప్రేక్ష అలంకారాన్ని మరింత రంగరించి అభివర్ణించవచ్చు. అయితే ఇక్కడితోనే అతని ఆట ఆగిపోదు కదా. ఇంకా భవిష్యత్తు కాలంలో మేము చాలా రాయాలి కాబట్టి అవన్నీ అలానే దాచి ఉంచాల్సి వస్తోంది. కానీ అతడి ఆట సమ్మోహితులను చేస్తోంది. ఎంతగా వర్ణించినా.. ఎంత గొప్పగా రాసినా.. ఇంకా ఏదో మిగిలి ఉంది.. ఇంకా ఏదో రాయాల్సి ఉంది అనే విధంగా అనిపిస్తోంది.

వైభవ్ సూర్య వంశీ కి ఆ పేరు తన తల్లిదండ్రులు ఏ ముహూర్తంలో పెట్టారో తెలియదు కానీ.. ఆ పేరుకు అతడు ప్రతి సందర్భంలో జస్టిఫికేషన్ ఇస్తూనే ఉన్నాడు. సూర్యుడిలాగా రెచ్చిపోతున్నాడు. భగభగ మండుతూ బ్యాటింగ్ చేస్తున్నాడు. గౌహతి లాంటి మైదానం మీద ఆ స్థాయిలో అతడు బ్యాటింగ్ చేస్తున్నాడు అంటే.. మిగతా మైదానాలు అతడికి జస్ట్ పూచిక పుల్ల తో సమానం. ఎందుకంటే ఈ మైదానం మీద బంతి బౌన్స్ అవుతుంది. వికెట్ మీదికి దూసుకు వస్తుంది. బ్యాట్ మీదికి రావడం చాలా కష్టంగా మారుతుంది. ఇంతటి ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ సూర్యవంశీ అలా ఆడుతున్నాడు అంటే అతని స్టైల్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

15 సంవత్సరాల వయసులోనే అతడు ప్రస్తుత ఐపీఎల్లో ఆరెంజ్ క్యాప్ దాకా వచ్చేసాడు. మామూలుగా అయితే కాకలు తీరిన బ్యాటర్లకు ఇటువంటి ఘనతలు సాధ్యమవుతాయి. కానీ అతడు జస్ట్ 15 సంవత్సరాలలో వయసులోనే దీనిని బద్దలు కొట్టేశాడు. మామూలుగా రికార్డుల కోసం ఆటగాళ్లు ఆడుతుంటారు. కానీ తన పేరు మీదనే రికార్డులు ఉంటాయని నిరూపిస్తున్నాడు వైభవ్. 15 సంవత్సరాలకు ఇంత విధ్వంసాన్ని సృష్టించి.. ఏకంగా ఆరెంజ్ క్యాప్ తన తల మీద ధరించిన అతడు.. ఇదే దూకుడు కనక కొనసాగిస్తే భవిష్యత్తు కాలంలో ఏ ఆటగాడికి ఏ క్యాప్ మిగల నిచ్చేలా లేడు. ఎందుకంటే అతడి దూకుడు అలా ఉంది మరి.

ప్రస్తుత ఐపిఎల్ లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు ఆడిన వైభవ్.. 200 పరుగులు చేశాడు. అతడు యావరేజ్ 50. ఆ తర్వాత స్థానంలో జైస్వాల్ ఉన్నాడు. ఇతడు కూడా నాలుగు మ్యాచ్లు ఆడి .. 183 పరుగులు చేశాడు. ఇతడు యావరేజ్ 91.50 గా ఉంది. ధృవ్ జూరెల్ నాలుగు మ్యాచ్లు ఆడి.. 176 పరుగులు చేశాడు. ఇతడు యావరేజ్ 58.67 గా ఉంది. సమీర్ రిజ్వి మూడు మ్యాచ్లలో 160 పరుగులు చేశాడు. యావరేజ్ 80 గా ఉంది. రఘు వంశీ నాలుగు మ్యాచ్లలో 155 పరుగులు చేశాడు. ఇతడి యావరేజ్ 51.67 గా ఉంది.

Exit mobile version