U19 Cricket World Cup Final: అండర్ – 19 2024 వరల్డ్ కప్ తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే ఫైనల్‌కు చేరిన భారత్.. ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. కీలకపోరుకు రంగం సిద్ధమైంది. టీమిండియా, ఆస్ట్రేలియా అమీతుమీ తెల్చుకోన్నాయి. శుక్రవారం జరిగిన రెండో సెమీఫైనల్లో పాకిస్తాన్‌పై వికెట్ తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించి ఫైలన్‌కు చేరుకుంది. అంతకు ముందు తొలి సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి టీమిండియా 9వసారి ఫైనల్‌కు చేరింది. ఇక ఆస్ట్రేలియా అండర్ – 19 వరల్డ్ కప్‌లో ఫైనల్‌కు చేరడం ఇది ఆరోసారి. ఫైనల్ మ్యాచ్ ఆదివారం (ఫిబ్రవరి 11న) సౌత్ ఆఫ్రికాలోని బినోని స్టేడియంలో జరుగుతుంది.
ప్రతీకారం తీస్చుకుంటారా..
గతేడాది కాలంగా ఐసీసీ ఈవెంట్ ఫైనల్‌లో భారత్–ఆస్ట్రేలియా తలపడడం ఇది మూడోసారి. రెండు ఈవెంట్ల(డబ్ల్యూటీసీ 2023, వన్డే వరల్డ్ కప్ – 2023)లో తలపడ్డాయి. రెండింటిలోనూ ఆస్ట్రేలియానే గెలిచింది. ఈ నేపథ్యంలో యువ భారత్ అయినా ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకోవాలని భారత క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. జూనియర్లు ప్రతీకారం తీర్చుకుంటారా.. లేక ముచ్చటగా మూడోసారి కూడా దాసోహం అంటారా చూడాలి.
ఇప్పటికి మనదేపై చేయి..
ఇక అండర్–19 వరల్డ్‌కప్‌లో భారత్ కంగారులపై పైచేయి సాధించింది. ఈ మెగా ఈవెంట్ ఫైనల్ పోరులో భారత్, ఆస్ట్రేలియా తలపడడం ఇది మూడోసారి. 2003లో తొలిసారి తలపడ్డాయి. ఈ టోర్నీలో ఆసీస్ కెప్టెన్‌గా రికీ పాంటింగ్ వ్యవహరించారు. భారత జట్టుకు సౌరవ్ గంగూలీ సారథి. అయితే ఈ ఫైనల్‌లో భారత్ 125 పరుగుల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసింది. తర్వాత 2012లో మరోసారి అండర్ – 19 వరల్డ్ కప్ ఫైనల్‌లో తలపడ్డాయి. ఇందులో ఉన్ముక్త్ సారథ్యంలోని భారత జట్టు ఆసీస్‌ను చిత్తు చేసింది. 2018లో వరల్డ్‌కప్ తుదిపోరులోనూ యువ భారత్ ఆస్ట్రేలియాను ఓడించింది. ఈసారి కూడా అదే ఫలితం రావాలని భారత అభిమానులు ఆశిస్తున్నారు. వస్తుందని గట్టిగా నమ్ముతున్నారు.
ఫామ్‌లో టీమిండియా..
ప్రస్తుతం భారత జట్టు మంచి ఫాంలో ఉంది. ఆసీస్‌ను ఓడించి మరోసారి టైటిల్ గెలిచేలా కనిపిస్తోంది. ఈటోర్నీలో భారత్ ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోకుండా ఫైనల్స్‌కు చేరింది. కెప్టెన్ ఉదయ్ సహారన్, ముషీర్‌ఖాన్, సచిన్‌దాస్ వంటి యువ సంచలనాలు అద్భుతమైన ఫాంలో ఉన్నారు. ఇక బౌలర్లు రాజ్ లింబానీ మరోసారి చెలరేగితే ఆసీస్ బ్యాటర్లకు కష్టాలు తప్పవు. అయితే ఆసీస్‌ను తక్కువగా అంచనా వేయలేం. ఫైనల్ అంటేనే ఆ జట్టుకు పూనకాలు వస్తాయి. ఆఖరి వరకూ పోరాడడమే ఆసీస్ ప్రధాన అస్త్రం. మరి ఛాంపియన్ ఎవరో తేలాలంటే ఆదివారం వరకు ఆగాల్సిందే.