U19 Asia Cup 2024: భారత్ తో పాటు పాకిస్థాన్ పరువు కూడా పాయే..!

బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ అయిన అరిఫుల్ ఇస్లాం 94 పరుగులు చేసి విజృంభించడంతో బంగ్లాదేశ్ టీం సెమీఫైనల్ లో ఇండియాను చిత్తు చేసి విజయం సాధించింది. ఇంక దాంతో బంగ్లాదేశ్ టీం ఫైనల్ లోకి అడుగుపెట్టింది.

Written By: Gopi, Updated On : December 16, 2023 9:16 am

U19 Asia Cup 2024

Follow us on

U19 Asia Cup 2024: భారీ అంచనాలతో అండర్ 19 ఆసియా కప్ టోర్నీని ప్రారంభించిన భారత్ టీమ్ కి సెమీఫైనల్ కి చేరుకుంది. అయినప్పటికీ సెమీఫైనల్ లో బంగ్లాదేశ్ తో జరిగిన భీకరమైన పోరాటంలో ఇండియన్ టీం ఓడిపోయి ఆసియా కప్ నుంచి వైదొలిగింది. ఇక ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియన్ టీం 42వ ఓవర్ 4 బంతులకి 188 పరుగులు మాత్రమే చేసింది. మురుగన్ అభిషేక్ 62 పరుగులు చేయగా, ముషీద్ ఖాన్ 50 పరుగులు చేశాడు. ఇక వీళ్లిద్దరూ రాణించడంతో ఇండియన్ టీమ్ ఆ స్కోర్ అయిన చేయగలిగింది. ఇక తర్వాత 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ టీం 42వ ఓవర్ 5వ బంతికి ఆరు వికెట్లు కోల్పోయి తమ లక్ష్యాన్ని చేరుకుంది. ముఖ్యంగా బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ అయిన అరిఫుల్ ఇస్లాం 94 పరుగులు చేసి విజృంభించడంతో బంగ్లాదేశ్ టీం సెమీఫైనల్ లో ఇండియాను చిత్తు చేసి విజయం సాధించింది. ఇంక దాంతో బంగ్లాదేశ్ టీం ఫైనల్ లోకి అడుగుపెట్టింది.

ఇక ఇదిలా ఉంటే పాకిస్తాన్ తో జరిగిన సెమీఫైనల్ లో పాకిస్తాన్ టీం యుఏఈ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఇక ఇండియా పాకిస్తాన్ రెండు ప్రత్యర్థి టీంలు సెమీ ఫైనల్ లో ఓడిపోయి వెనుతిరగడం అనేది బహుశా ఇదే మొదటిసారేమో అందరూ ఈ రెండు టీములు సెమీఫైనల్ గెలిచి ఫైనల్లో తలపడతాయని అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బంగ్లాదేశ్ ఇండియాకి షాక్ ఇస్తే యుఏఈ పాకిస్తాన్ కి షాక్ ఇచ్చింది.

ఇక ఇప్పుడు ఫైనల్ లో బంగ్లాదేశ్ యూఏఈ రెండు జట్లు కూడా తలపడబోతున్నాయి. ఇక ఈ కప్ ని ఏ టీం గెలుచుకుంటుంది అనేది కీలకంగా మారింది. ఇక ఇప్పటికీ అయితే బంగ్లాదేశ్ ఫేవరెట్ గా కనిపిస్తున్నప్పటికీ కూడా యూఏఈ ని అంత తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు అని మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు…

ఇక ఒకేసారి ఇండియా పాకిస్థాన్ జట్లు ఓటమి పాలవ్వడం ఏషియా కప్ నిర్వాహకులకు కూడా భారీ దెబ్బ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ రెండు టీమ్ లు ఫైనల్ ఆడితే ఆ మ్యాచ్ మీద చాలా వరకు బిజినెస్ జరిగేది. ఇప్పుడు బంగ్లాదేశ్ యూఏఈ మ్యాచ్ ఎవరు చూస్తారు అంటూ మరికొంత మాట్లాడుతున్నారు… ఇక ఏది ఏమైనా కూడా ఆసియా కప్ నిర్వాహకులకు చాలా వరకు మైనస్ అయింది…