New Zealand Super 8 Match Rained Out: టి20 వరల్డ్ కప్ లో భాగంగా కొలంబో వేదికగా సూపర్ 8 లో న్యూజిలాండ్, పాకిస్తాన్ పోటీ పడుతున్నాయి. ఈ మ్యాచ్ సాయంత్రం ప్రారంభం కావాల్సి ఉంది. అభిమానులు కూడా భారీగా మైదానానికి వచ్చారు. ఈ నేపథ్యంలో వాతావరణం అకస్మాత్తుగా మారిపోయింది. ఉన్నట్టుండి వర్షం మొదలైంది. దీంతో మ్యాచ్ రద్దయింది.
ఈ కథనం రాసే సమయం వరకు కూడా వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ రద్దయింది.. ఫలితంగా రెండు జట్లకు చెరొక పాయింట్ లభించింది. సూపర్ 8 లో ప్రతి జట్టు మూడు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. భారీగా కురిసిన వర్షం వల్ల ఈ మ్యాచ్ రద్దు కావడంతో.. పాకిస్తాన్.. న్యూజిలాండ్ తదుపరి రెండు మ్యాచ్లలో కచ్చితంగా విజయం సాధించాలి. ఒకవేళ ఓటమిపాలైతే మాత్రం.. తదుపరి జట్ల ఫలితాలు మీద ఆధార పడాల్సి ఉంటుంది.
గ్రూప్ వన్ లో ఇండియా, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే జట్లు ఉన్నాయి.. గ్రూప్ 2లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక జట్లు ఉన్నాయి. లీగ్ దశలో న్యూజిలాండ్ దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. పాకిస్తాన్ టీం ఇండియా చేతిలో ఓటమిపాలైంది..
ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో సెమి ఫైనల్.. ఫైనల్ మ్యాచ్ లకు మాత్రమే రిజర్వ్ డే ఉంది. అలాంటప్పుడు సూపర్ 8 దశలో మ్యాచ్ లు రద్దయితే.. అప్పుడు రెండు జట్లకు చెరొక పాయింట్ లభిస్తుంది. పాకిస్తాన్ జట్టు మీద న్యూజిలాండ్ కు మెరుగైన రికార్డులు ఉన్నాయి. కొలంబో వేదికగా జరిగే మ్యాచ్లో న్యూజిలాండ్ ఫేవరెట్ గా ఉంది . ఊహించని విధంగా వర్షం కురిసిన నేపథ్యంలో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. రాత్రి 9 గంటల సమయంలో వర్షం కాస్త తగ్గినప్పటికీ.. వర్షం వల్ల అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారిపోయింది. వర్షం నుంచి మైదానాన్ని రక్షించడానికి పెద్దపెద్ద టార్పాలిన్ లు కప్పినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది.. కొలంబో మైదానంలో మురుగునీటి సరఫరా వ్యవస్థ మెరుగ్గానే ఉన్నప్పటికీ.. వర్షం కురుస్తున్న నేపథ్యంలో నిర్వాహకులకు మ్యాచ్ ను ముందుకు సాగించడం ఇబ్బందిగా మారింది. దీంతో మ్యాచ్ మొత్తాన్ని రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు.