Sunrisers Hyderabad: గత ఐపీఎల్ సీజన్‌లో ఎదురైన వరుస పరాజయాల నుంచి కోలుకుని కొత్త సీజన్ మొదలు పెట్టేందుకు సన్ రైజర్స్ హైదరాబాద్ సిద్ధమవుతోంది. గత సీజన్‌లో కెపన్టెన్‌గా ఎంచుకున్న దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ జట్టును విజయంవైపు నడిపించడంలో ఫెయిల్ అయ్యాడు. దీంతో పేలవ ప్రదర్శనతో లీగ్ దశలోనే టోర్నీ నుంచి జట్టు నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో ఈసారి కెప్టెన్ ఎంపికపై జట్టు యాజమాన్యం ఆచితూచి వ్యవహరిస్తోంది. సారథ్యం వహించే ఆటగాళ్లు జట్టులో ఉన్న సక్సెస్‌ఫుల్ సారథిగా సామర్థ్యం ఎవరికి ఉందని వెతుకుతోంది. ఈ క్రమంలో ముగ్గురు ఆటగాళ్లు యాజమాన్యానికి బెస్ట్ ఆప్షన్‌గా కనిపిస్తున్నారు. వీరిలో ఎవరిని కెప్టెన్సీ వరించబోతుంది అన్నది ఆసక్తిగా మారింది.
మార్‌క్రమ్ వారసలుగా..
మార్‌క్రమ్ కాకుండా ఆయన వారసులుగా సన్ రైజర్స్ జట్టును నడిపించే ఆటగాళ్లలో పాట్ కమిన్స్ ముందు వరుసలో ఉన్నాడు. గతేడాది ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా ఎంపిక కావడంతోపాటు ఆస్ట్రేలియాకు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌ను, వన్డే ప్రపంచకప్ అందించాడు. సన్ రైజర్స్ జట్టుకు బెస్ట్ ఆప్షన్‌గా అతడే కనిపిస్తున్నాడు. ఇతడిని ఇటీవలి వేలంలో రూ.20.50 కోట్లకు యాజమాన్యం కొనుగోలు చేసింది.
ట్రావిస్ హెడ్ కూడా..
ఇక రెండో ఆప్షన్‌గా ఆస్ట్రేలియా వన్డే వరల్డ్‌కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన ట్రావిస్ హెడ్ ఉన్నారు. ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్నాడు హెడ్. గతంలో బిగ్ బాష్ లీగ్‌లో కెప్టెన్‌గా వ్యవహించిన అనుభవం ఉంది. దీర్ఘకాలిక అవసరాలను బట్టి చూస్తే ట్రావిడ్ హెడ్ మంచి ఆప్షన్ అని యాజమాన్యం భావిస్తోంది.
భారత్ నుంచి ‘భువి’
ఇక భారత బౌలర్ భువనేశ్వర్ కుమార్ కూడా కెప్టెన్సీ రేసులో ఉన్నాడు. గతంలో కెప్టెన్‌గా, వైస్ కెప్టెన్‌గా పనిచేశాడు. గత సీజన్‌లో మార్ క్రమ్ జట్టులో చేరకముందు కెప్టెన్‌గా జట్టును నడిపించాడు. భారతీయ క్రికెటర్‌ను పెట్టాలనుకుంటే భువీ బెస్ట్ అని సన్‌రైజర్స్ యాజమాన్యం భావిస్తోంది.